ఏసీబీకి పట్టుబడిన ఏఈఓ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి పట్టుబడిన ఏఈఓ

May 14 2026 1:01 AM | Updated on May 14 2026 1:01 AM

ఏసీబీకి పట్టుబడిన ఏఈఓ

అదుపులో మరో వ్యక్తి

ఎమ్మిగనూరురూరల్‌: పట్టణంలోని వ్యవసాయ కార్యాలయంలో బుధవారం సాయంత్రం రూ.30 వేలు లంచం తీసుకుంటున్న ఏఈఓ నరసింహులు, కార్యాలయంలో ఉన్న అనధికార వ్యక్తి మోహన్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌ వ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఈడిగ రంగన్న గౌడ్‌ అంబేద్కర్‌ సర్కిల్‌ మహలక్ష్మీ ట్రేడర్స్‌ ఫర్టిలైజర్‌ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. షాప్‌ లైసెన్సు కు రెన్యూవల్‌తో పాటు ఇదే షాప్‌లో ఫెస్టిసైడ్స్‌ విక్రయించేందుకు కొత్తగా లైసెన్స్‌ కోసం వ్యవసాయ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే లైసెన్సు మంజూరు చేయాలంటే రూ. 35 వేలు ఇవ్వాలని ఏఈఓ నరసింహులు.. డీలర్‌ రంగన్నగౌడ్‌కు చెప్పాడు. దీంతో ఆయన ఏసీబీ అధికారులను సంప్రదించాడు. పక్కా ప్లాన్‌తో బుధవారం సాయంత్రం ఏఈఓకు రూ. 30 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏఈఓతో పాటు కార్యాలయంలో పనిచేసే అనధికార వ్యక్తి మోహన్‌ దగ్గర రూ. 73,600ను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఏ కార్యాలయంలోనైనా పనులకు లంచం అడిగితే నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదింవచ్చునని సూచించారు. దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్‌, కృష్ణయ్య, ఎస్‌ఐ సుబ్బారాయుడుతోపాటు సిబ్బంది ఉన్నారు. అయితే ఏసీబీ దాడులు జరిగినప్పుడు ఏడీఏ, ఏవో కార్యాలయాల్లో లేకపోవటం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement