టీడీపీ కార్యాలయానికి కేటాయించిన స్థలంలో వేర్ హౌజ్ గోడౌన్లు ఉన్నాయి. చిన్న పాటి మరమ్మతులు చేస్తే పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు ఉపయోగపడతాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు వీటిని పట్టించుకోలేదు. కోట్ల రూపాయలు వెచ్చించి గత ప్రభుత్వాలు రైతుల కోసం గోడౌన్లు నిర్మించాయి. టీడీపీ కార్యాలయం కోసం ఇప్పుడు ఆ భవనాలను ధ్వంసం చేయనున్నారు. వీటి కోసం ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలను టీడీపీ నుంచి వసూలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


