సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికుడు సుబ్రహ్మణ్యం (50) మృతి చెందాడు. మృతుడిని చిత్తూరు జిల్లా సుగంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
మృతదేహాన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 30 మంది ప్రయాణికులతో జై భారత్ ట్రావెల్స్ బస్సు అరుణాచలం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు లారీని ఓవర్‌టేక్ చేయబోయి ఢీ కొట్టింది.


