కుమార్తె పొలిటికల్‌ ఎంట్రీపై బొత్స కీలక ప్రకటన | Botsa Satyanarayana Key Announcement Daughter Political Entry | Sakshi
Sakshi News home page

కుమార్తె పొలిటికల్‌ ఎంట్రీపై బొత్స కీలక ప్రకటన

Aug 19 2026 4:52 PM | Updated on Aug 19 2026 5:38 PM

Botsa Satyanarayana Key Announcement Daughter Political Entry

సాక్షి, విజయవాడ: తన కుమార్తె రాజకీయ ప్రవేశంపై వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. స్థానిక ఎన్నికల్లో కుమార్తె అనూషను  పోటీ చేస్తుందని బొత్స వెల్లడించారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నట్టు ఆయన తెలిపారు. వారసురాలుగా కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకొస్తున్న బొత్స.. ఎన్నికలు ఏ పద్దతిలో జరిగిన పోటీ చేయిస్తానని వెల్లడించారు.

కాగా, అంతకుముందు బొత్స సత్యనారాయణ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. మూడో రోజు కూడా కూటమి పారిపోయే వైఖరి అవలంభించిందని.. బయట మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. డీఎస్సీపై సీబీఐ ఎంక్వైరీ వేయాలన్న బొత్స.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

‘‘రాష్ట్ర చరిత్రలో కొత్త సంప్రదాయానికి తెరతీశారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో పాలక పార్టీ బయటకి వెళ్ళిపోయింది. సభా సంప్రదాయం పాలక పక్షం అమలు చేయాలి. 5 కోట్ల మందికి బాధ్యత వహించాలని వెన్నుపోటూ పార్టీకి లేదు. ఒంటెద్దు పోకడతో ప్రవర్తిస్తుంది’’ అంటూ బొత్స మండిపడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement