ఏంటి తమాషాలు చేస్తున్నారా? నాకు పనిలేక ఇక్కడికొస్తున్నానా? | Collector MS Harendhira Prasad Fire On Revenue Surveyor | Sakshi
Sakshi News home page

ఏంటి తమాషాలు చేస్తున్నారా? నాకు పనిలేక ఇక్కడికొస్తున్నానా?

Oct 4 2026 1:01 PM | Updated on Oct 4 2026 1:09 PM

Collector MS Harendhira Prasad Fire On Revenue Surveyor

మండల సర్వేయర్‌ దేవుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టరు హరేంధిరప్రసాద్‌

కాకినాడ :  ‘ఏంటి తమాషాలు చేస్తున్నారా? నాకు పనిలేక వారం వారం ఇక్కడికొస్తున్నానా?..’ అంటూ పె ద్దాపురం రెవెన్యూ సర్వేయర్‌పై కలెక్టర్‌ ఎంఎస్‌ హరేంధిరప్రసాద్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నెల.. ఒక్క నియోజకవర్గం.. నాలుగు పర్యటనలు.. కార్యక్రమంలో భాగంగా శనివారం పెద్దాపురం మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్‌ ఎంఎస్‌ హరేంధిర ప్రసాద్‌ నిర్వహించారు. 

నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిపై సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా గత మూడు వారాలుగా పెద్దాపురంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం అర్జీలపై నేరుగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.దివిలి గ్రామంలో మొదటి వారంలో వచ్చిన అర్జీపై రెవెన్యూ అదికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మండల సర్వేయర్‌ దేవుడుని పిలిచి నెలరోజులైనా ఎందుకు దీనిపై విచారణ చేపట్టలేదని నిలదీశారు. 

‘నేను ప్రతి వారం కాకినాడ నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇక్కడికొస్తుంటే.. నువ్వు మాత్రం ఫీల్డ్‌లోకి వెళ్లకుండా నాటకాలు ఆడుతున్నావా..’ అంటూ మండిపడ్డారు. సోమవారంలోగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఆర్డీవో పి.కృష్ణమూర్తి, డీఎస్పీ ఏబీజీ తిలక్, డీఎల్‌డీవో స్వప్న, జెడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీలలితతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement