breaking news
Revenue Surveyors
-
ఏంటి తమాషాలు చేస్తున్నారా? నాకు పనిలేక ఇక్కడికొస్తున్నానా?
కాకినాడ : ‘ఏంటి తమాషాలు చేస్తున్నారా? నాకు పనిలేక వారం వారం ఇక్కడికొస్తున్నానా?..’ అంటూ పె ద్దాపురం రెవెన్యూ సర్వేయర్‌పై కలెక్టర్ ఎంఎస్ హరేంధిరప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నెల.. ఒక్క నియోజకవర్గం.. నాలుగు పర్యటనలు.. కార్యక్రమంలో భాగంగా శనివారం పెద్దాపురం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ ఎంఎస్ హరేంధిర ప్రసాద్ నిర్వహించారు. నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిపై సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా గత మూడు వారాలుగా పెద్దాపురంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమం అర్జీలపై నేరుగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.దివిలి గ్రామంలో మొదటి వారంలో వచ్చిన అర్జీపై రెవెన్యూ అదికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మండల సర్వేయర్ దేవుడుని పిలిచి నెలరోజులైనా ఎందుకు దీనిపై విచారణ చేపట్టలేదని నిలదీశారు. ‘నేను ప్రతి వారం కాకినాడ నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇక్కడికొస్తుంటే.. నువ్వు మాత్రం ఫీల్డ్‌లోకి వెళ్లకుండా నాటకాలు ఆడుతున్నావా..’ అంటూ మండిపడ్డారు. సోమవారంలోగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఆర్డీవో పి.కృష్ణమూర్తి, డీఎస్పీ ఏబీజీ తిలక్, డీఎల్డీవో స్వప్న, జెడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీలలితతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సర్వేయర్లను అడ్డుకున్న స్థానికులు
వజ్రపు కొత్తూరు (శ్రీకాకుళం) : భామనపాడు పోర్టు కోసం భూ సర్వేకు వచ్చిన సర్వేయర్లను స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో మంగళవారం మద్యాహ్నం చోటుచేసుకుంది. పోర్టు నిర్మాణానికి సాగు భూములు లాక్కునేందుకు రేపు ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీనిలో భాగంగా మంగళవారం రెవెన్యూ అధికారులు సర్వేకు వచ్చారు. వీరిని స్థానికులు అడ్డుకున్నారు.


