టీడీపీ నేతల నుంచి నాకు ప్రాణహాని ఉంది: కేతిరెడ్డి | Kethireddy Pedda Reddy Sensational Comments On Jc Prabhakar Reddy | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల నుంచి నాకు ప్రాణహాని ఉంది: కేతిరెడ్డి

Oct 4 2026 12:03 PM | Updated on Oct 4 2026 12:10 PM

Kethireddy Pedda Reddy Sensational Comments On Jc Prabhakar Reddy

సాక్షి, అనంతపురం: టీడీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని.. టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ తాడిపత్రి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు తెలిసే ఇదంతా జరుగుతోందా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.

జేసీ అరాచకాలపై అనంతపురం ఎస్పీ జగదీష్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిలదీసిన కేతిరెడ్డి.. తన ఇంటి వద్ద అనుమానాస్పదంగా సంచరించే వారిని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ‘‘నా గన్‌మెన్‌ను ట్రాప్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు. నా కదలికలపై జేసీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. సాక్షాత్తూ పోలీసులే జేసీ ప్రభాకర్‌రెడ్డికి కోవర్ట్‌గా మారడం దురదృష్టకరం’’ అని కేతిరెడ్డి పేర్కొన్నారు.

‘‘పోలీసులు జేసీ తొత్తులుగా వ్యవహరించడం దుర్మార్గం. మాజీ ఎమ్మెల్యేకే రక్షణ కల్పించలేని పోలీసులు ఎందుకు?. థర్డ్ పార్టీ విచారణ జరిగితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలి’’ అని మాజీ కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: అమెరికా రోడ్డు ప్రమాదం.. తెలుగు యువతి మృతి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement