● చెడ్డీ విప్పి టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు అసభ్యకర ప్రవర్తన
● గ్రామస్తుడిపై దాడి.. ఆపై బూతు పురాణం
శెట్టూరు: ఆదర్శంగా నిలవాల్సిన ఓ ప్రజాప్రతినిధి బహిరంగ ప్రదేశంలో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన మండలంలోని చింతర్లపల్లిలో చోటుచేసుకుంది. టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు చెన్నకేశవులు జనమంతా చూస్తుండగానే తన చెడ్డీ విప్పి ఏంపీక్కుంటారో.. పీక్కోండి... అంటూ అసభ్యకరంగా ప్రవర్తించడం కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం ఉదయం తాగునీరు గ్రామానికి వదిలిన సమయంలో ఒక వీధిలో కరెంటు సరఫరా ఆగింది. ట్రాన్స్‌ఫార్మర్‌లోని ఫ్యూజులు తొలగించడం వల్ల కరెంటు పోయిందని గమనించిన గొల్ల మల్లికార్జున అనే వ్యక్తి.. ఎవరో ఫ్యూజులు సమయానికి తొలగించారంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఎంపీటీసీ ఇంటి వైపు వచ్చాడు. దీంతో ఎంపీటీసీ చెన్నకేశవులు...మల్లికార్జునపై ఇటుక పెళ్లతో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా అసభ్యకరంగా దూషించడం మొదలు పెట్టాడు. పద్ధతిగా మాట్లాడు అని మల్లికార్జున అనడంతో అతను మరింత రెచ్చిపోయాడు. ప్రజాప్రతినిధినన్న విషయాన్ని మరచి బహిరంగంగానే ‘ పీక్కోండి’ అంటూ దుస్తులు విప్పాడు. దీంతో అక్కడున్న మహిళలు తలొంచుకుంటూ వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీడీపీ ఎంపీటీసీ ప్రవర్తనను ప్రజలు ఏవగించుకుంటున్నారు.
‘పాల్’ పాఠశాలల అమలు తీరు పరిశీలన
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న పర్సనలైజ్డ్ అడాప్టివ్ లర్నింగ్ (పీఏఎల్–పాల్) కార్యక్రమం తీరును పరిశీలించేందుకు రాష్ట్ర పరిశీలకులు కిశోర్ గార్లదిన్నె ఏపీ మోడల్ స్కూల్, బి. పప్పూరులోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ పాఠశాలను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో పాల్ కార్యక్రమం అమలు విధానం, విద్యార్థులు వినియోగిస్తున్న అభ్యసన వనరులు, డిజిటల్ విద్యా పద్ధతులు, విద్యార్థుల భాగస్వామ్యాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అసిస్టెంట్ ఏఎంఓ ఫణిరాజ్, ఎఫ్‌ఎంఎస్ ప్రభు పాల్గొన్నారు.
హైకోర్టు ఆదేశాలతో 16 మంది ఓటర్లకు న్యాయం
రాప్తాడు రూరల్: హైకోర్టు ఆదేశాలతో అనంతపురం రూరల్ కాటిగానికాల్వకు చెందిన 16 మంది ఓటర్లకు న్యాయం జరిగింది. వివరాలు.. కాటిగానికాలవ గ్రామానికి చెందిన శీలక భారతి, సోమశేఖర్‌రెడ్డి, లక్ష్మీనారాయణమ్మ, విమలాదేవి, నారాయణరెడ్డి, వాణి, రామకృష్ణారెడ్డి, రమణారెడ్డి, సరస్వతి, నరసింహారెడ్డి, శీలక నారాయణరెడ్డి, వెంకటశివారెడ్డి, కొండ్రెడ్డి రాధిక తదితరులు అదే గ్రామంలో నివాసాలు, ఆస్తులు కలిగి ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వీరందరూ అక్కడే ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరందరూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే. అయితే వీరిఓట్లను ఎలాగైనా లేకుండా చేయాలన్న దురుద్దేశంతో అనంతపురం నగరానికి శాశ్వతంగా వలస వెళ్లారని టీడీపీ నాయకులు ఫారం–7 ద్వారా ఫిర్యాదు చేశారు. కనీసం విచారణ చేయకుండా, నోటీసు ఇవ్వకుండా వీరందరి పేర్లను జాబితా నుంచి తొలిగించారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాధితులు..
ఓటర్ల జాబితాలో తమ పేర్లను తిరిగి చేర్చాలని ఇక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 16 మంది పిటిషనర్లలో 15 మందిని పార్ట్ నంబర్ 112లో, ఒకరిని పార్ట్ నంబర్ 113లో చేర్చినట్లు ఎన్నికల నమోదు అధికారి నివేదించారు. అన్యాయంగా తమ ఓటు హక్కు తొలగించారనే ఆవేదనతో మొదలైన పోరాటం, హైకోర్టు జోక్యంతో సానుకూల ఫలితాన్ని సాధించింది. తమ హక్కు కోసం నిలబడిన 16 మంది ఓటర్లకు న్యాయం దక్కడం కాటిగానికాలవలో చర్చనీయాంశంగా మారింది.
పామిడిలో నామినేషన్ పత్రాల చింపివేత
పామిడి: మండల కేంద్రంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనుచరులు గురు వారం హల్‌చల్ చేశారు. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను లాక్కొని చించేశారు. దీంతో అభ్యర్థులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సమయానుకూలంగా నామినేషన్లు వేయిస్తామని చెప్పడంతో అశావాహులు అసహనం వ్యక్తంచేశారు. ఇదిలాఉంటే స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై అధికారపార్టీ ఓ గుండా దౌర్జన్యం చేయడంతో ఇరువర్గాల నడుమ ఘర్షణకు దారితీసింది. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే అనుచరవర్గం, రౌడీలు రాడ్లు చేతపట్టుకొని ఎద్దులపల్లిరోడ్డులో హల్‌చల్ చేశారు. ఆ రౌడీమూక ఒక్కసారిగా ఎద్దులపల్లిరోడ్డులోని పెమ్మక చెన్నకేశవరెడ్డి ఫర్టిలైజర్స్ షాపు వైపునకు పరుగులు తీశారు. సీఐ బీ మనోహర్ నేతృత్వంలో పోలీసులు, స్పెషల్‌పార్టీ పోలీసులు అవాంఛనీయ సంఘటన జరగకుండా అదుపుచేశారు. ఎన్నికల్లో గెలవలేక పామిడిలో ఎన్నడూ లేని విధంగా అధికారపార్టీ గుండాయిజానికి పాల్పడడడంపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.


