మహబూబాబాద్: అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన దారం సుప్రజ మృతి చెందారు. సెయింట్ లూయిస్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఆమె.. రాత్రి రెస్టారెంట్ మూసివేసి స్నేహితురాలితో కారులో ఇంటికి బయలుదేరారు. కొద్దిసేపటికే కారును ట్రక్‌ను ఢీకొనడంతో సుప్రజ అక్కడికక్కడే మృతి చెందగా.. స్నేహితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. సుప్రజకు భర్త, కుమారుడు ఉన్నారు.
ఇదీ చదవండి: Viral Video: రెండు ఇళ్ల గోడల మధ్య ఇరుక్కున్న వృద్ధుడు


