పండ్ల దుకాణాల్లో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

పండ్ల దుకాణాల్లో తనిఖీలు

May 13 2026 1:26 AM | Updated on May 13 2026 1:26 AM

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు నగరంలో నిబంధనలకు విరుద్ధంగా పండ్లను మాగిస్తున్న దుకాణాలపై మంగళవారం ఆహార భద్రత విభాగం (ఫుడ్‌ సేఫ్టీ) అధికారులు తనిఖీలు నిర్వహించారు. నగరంలోని మండిబజార్‌లో ఉన్న గౌస్‌ ఫ్రూట్స్‌ కంపెనీ, షమీవుల్లా ఫ్రూట్‌ మర్చంట్‌ దుకాణాల్లో తనిఖీలు చేసి అరటి, మామిడి పండ్లు మాగిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఇథలిన్‌ గ్యాస్‌ను గదిలోకి పంపి పండ్లను మాగించకుండా ఇథలిన్‌ పౌడర్‌ను నీళ్లలో కలిపి అందులో పండ్లను మాగించడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇలా మాగించిన పండ్లను తినడం వల్ల వ్యాధులు వస్తాయని ఫుడ్‌ సేఫ్టీ అధికారి రాజగోపాల్‌ చెప్పారు. ఈ మేరకు అరటి, మామిడి పండ్లను శాంపిల్‌ తీసి ల్యాబోరేరీకి పంపించారు. డిస్ట్రిక్ట్‌ కన్జూమర్‌ సెక్రటరీ శివమోహన్‌రెడ్డి తదితరులు వెంట ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement