ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

May 18 2026 9:37 AM | Updated on May 18 2026 9:37 AM

కర్నూలు సిటీ: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. నగర శివారులోని దుపాడు దగ్గర ఉన్న ఐయాన్‌ డిజిటల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయ ంత్రం 5.30 గంటల వరకు పేపర్‌–2 పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు మొత్తం 973 మంది విద్యార్థులు హాజరయ్యారు. అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు బీఆర్క్‌ కోర్సుల్లో చేరాలనుకుంటే ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు(ఏఏటీ)రాయల్సి ఉంటుంది. ఈ పరీక్ష వచ్చే నెల 1న రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే, 4వ తేదీన పరీక్ష నిర్వహించి, 7వ తేదీ తుది ఫలితాలు ప్రకటించనున్నారు. అడ్వాన్డ్‌స్‌ పరీక్షకు హాజరైన విద్యార్థుల ఓఎంఆర్‌ 21న వెబ్‌సైట్‌లో ఉంచి 25వ తేదీ ప్రాథమిక కీ విడుదల చేస్తారు. జూన్‌ 1వ తేది ఉదయం 10 గంటలకు తుదికీ ఫలితాలను విడుదల చేయనున్నారు. పేపర్‌–1, పేపర్‌–2 రెండు పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను మాత్రమే విడుదల చేయనున్నారు. జూన్‌ 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు జోసా (జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ ఆథారిటీ–జేఓఎస్‌ఏఏ) కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది.

జాతీయ పోటీలకు ‘ౖసైసెరా’

కర్నూలు కల్చరల్‌: తిరుపతి అభినయ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో జూలైలో నిర్వహించనున్న జాతీయ స్థాయి నాటక పోటీలకు ‘ౖసైసెరా నరసింహారెడ్డి’ నాటకం ఎంపికై ంది. ఈ మేరకు అభినయ ఆర్ట్స్‌ అధ్యక్షుడు బీఎన్‌ రెడ్డి ప్రకటించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను నాటక రూపంలో పత్తి ఓబులయ్య దర్శకత్వంలో ప్రదర్శించనున్నారు. ఈ నాటకం నంది నాటక పోటీలలో పాల్గొని వెండి నందితో పాటు ఇతర నందులను కై వసం చేసుకుంది. గత నెలలో మిర్యాలగూడలో నిర్వహించిన జాతీయస్థాయి పద్య నాటక పోటీల్లో ద్వితీయ బహుమతిని పొందిందని పత్తి ఓబులయ్య తెలిపారు. ప్రస్తుతం అభినయ ఆర్ట్స్‌ పోటీలకు ఎంపిక కావడంపై పలువురు కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement