నందవరం: దాదాపు పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికతో ఆ పాఠశాలలో ఆనందాలు విరబూశాయి. స్థానిక నాగలదిన్నె జెడ్పీ హైస్కూల్ ప్రాంగణం ఇందుకు వేదికైంది. స్థానిక పాఠశాలలో 2000–2001 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు పాతికేళ్ల తరువాత ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నా రు. ఆనాటి తీపి జ్ఞాపకాలు, ఆటలు, అల్లర్లు గుర్తుకు తెచ్చుకుంటూ ఒకరునొకరు పిలుచుకుంటూ ఉత్సాహంగా గడిపారు. వివిధ వృత్తులు, ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడి పలు ప్రాంతాల్లో ఉన్న వారంతా తరలివచ్చారు. విద్యార్థులందరూ వినోద కార్యక్రమంలో పాల్గొని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఆనాడు చదువు చెప్పిన గురువులు షాజహాన్, నరసింహులు, రంగస్వామి, ఉస్సేన్ తదితర ఉపాధ్యాయులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు.


