ప్యాపిలి: పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి ఆదేశించారు. స్థానిక మండల మహిళా సమాఖ్య భవనంలో బుధవారం వీఓఏలు, సీసీలతో ఆయన సమావేశం నిర్వహించారు. పొదుపు మహిళలు ఎంచుకున్న జీవనోపాధి చేసుకోవడానికి హెచ్‌ఎల్పీ, ఎంసీపీ తయారు చేయాలని ఆదేశించారు. పొదుపు సంఘాలకు సంబంధించిన బ్యాంకు రుణాల వివరాలు, సీ్త్రనిధి, ఉన్నతి ద్వారా తీసుకున్న రుణాల వివరాలను వంద శాతం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.
ఎంపీడీఓ ముందే ఉద్యోగుల బాహాబాహీ
ఆళ్లగడ్డ: ఎంపీడీఓ సమక్షంలోనే ఇద్దరు జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు తీవ్రంగా కొట్టుకున్న ఘటన బుధవారం రుద్రవరంలో కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నూర్ అహమ్మద్‌కు చెందిన వ్యక్తిగత బిల్లు సమాచారం ఎంపీడీఓ లాగిన్‌కు వచ్చింది. ఈ బిల్లు పెట్టాలని జూనియర్ అసిస్టెంట్ హరికిషన్‌కు తెలిపారు. అతను సరిగ్గా స్పందించక పోవడంతో ఈ విషయంపై ఎంపీడీఓతో సీనియర్ అసిస్టెంట్ మాట్లాడుతున్నాడు. ఈ సయమంలో జూనియర్ అసిస్టెంట్ రావడంతో సీనియర్ అసిస్టెంట్ చెయ్యి చేసుకున్నాడు. ఎంపీడీఓ ముందే ఇద్దరూ బాహాబాహీకి దిగారు. గట్టిగా కేకలు వినిపించడంతో ఇతర గదుల్లో ఉన్న సిబ్బంది అక్కడకు వచ్చి ఇద్దరినీ విడిపించారు. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్ అసిస్టెంట్‌కు బాధ్యతలు అప్పగించడమే గొడవకు కారణమని తెలుస్తోంది.
బాలికపై లైంగిక దాడి
● యువకుడిపై పొక్సో కేసు నమోదు
నందికొట్కూరు: పట్టణంలోని ఓ ప్రాంతానికి చెందిన 13 బాకలికపై అదే ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువకుడు ఈ నెల 2న లైంగికదాడి చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు నందికొట్కూరు టౌన్ సీఐ అశోక్ కుమార్ బుధవారం విలేకరులకు తెలిపారు. లైంగికదాడి చేసిన యువకుడు బాలికకు సొంత మేనమామ అని తెలిసింది.
రూ.60 కోట్లతో
26 రోడ్ల పనులు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాస్కీలో భాగంగా రూ.60 కోట్లతో 26 రోడ్ల పునరుద్ధరణ పనులు(110 కిలోమీటర్ల మేర) చేపట్టనున్నట్లు పీఆర్ పర్యవేక్షక ఇంజనీరు జి.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీఆర్‌ఆర్‌ఎస్‌పీ కింద ఈ పనులకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాన్ని అందిస్తోందన్నారు. ఈ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఒకే ప్యాకేజీ కింద ఈ పనులను చేపడతామన్నారు.
క్యాజువాలిటీ ఆకస్మిక తనిఖీ
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీ విభాగంలో బుధవారం రాత్రి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో విధుల్లో లేని డీఏపీ, డీఏఎస్‌లకు మెమోలు జారీ చేశారు. చికిత్సకు వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం, చికిత్స వివరాలను తెలుసుకున్నారు. డ్యూటీ సమయంలో వైద్యులు, సిబ్బంది విధిగా విధుల్లో ఉండాలని, లేనివారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంఓ పద్మజ తదితరులు ఉన్నారు.
పసుపుల గ్రామ పంచాయతీకి ఐఎస్‌ఓ సర్టిఫికెట్
కర్నూలు సిటీ: కర్నూలు రూరల్ మండల పరిధిలోని పసుపుల గ్రామ పంచాయతీ ఐఎస్‌ఓ సర్టి ఫికెట్‌కు ఎంపికై ంది. బుధవారం ఆ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిథిగా పాల్గొని ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను జిల్లా గ్రామ పంచాయతీ అధికారి జి.భాస్కర్, ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి హేమంత్ కుమార్ రెడ్డిలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఐఎస్‌ఓ సర్టిఫికెట్ పొందిన 18వ గ్రామ పంచాయతీగా పసుపుల గ్రామ పంచాయతీ ఎంపికై ందన్నారు.


