దేవస్థానం అధికారిక వైబ్‌సైట్‌ను వినియోగించాలి | - | Sakshi
Sakshi News home page

దేవస్థానం అధికారిక వైబ్‌సైట్‌ను వినియోగించాలి

May 12 2026 5:36 AM | Updated on May 12 2026 5:36 AM

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానంలో ఆర్జిత సేవా టికెట్లు, స్పర్శదర్శనం టికెట్లు, వసతి గదులను ముందస్తు బుకింగ్‌ కోసం దేవస్థాన అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించుకోవాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఈఓ మాట్లాడుతూ శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో అన్నీ ఆర్జిత సేవలు, మల్లికార్జున స్వామివారి స్పర్శదర్శన టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా పొందే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. 17 ఆర్జిత సేవలకు సంబంధించిన సేవాటికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా భక్తులు పొందవచ్చన్నారు. అలాగే వసతిని కూడా ముందస్తుగా ఆన్‌లైన్‌లో రిజర్వ్‌ చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు. భక్తులు రాష్ట్ర దేవదాయశాఖ అధికారిక వైబ్‌సైట్‌ www.aptemples.ap.gov.in, దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ www. srisaila devasthanam. org ద్వారా మాత్రమే వినియోగించుకోవాలని అన్నారు. అలాగే మనమిత్ర వాట్సాప్‌ ద్వారా కూడా అన్నీ ఆర్జిత సేవా టికెట్లను, మల్లన్న స్పర్శదర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లను పొందవచ్చునని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement