నేర పరిశోధనలో ఫోరెన్సిక్‌ కీలకం | - | Sakshi
Sakshi News home page

నేర పరిశోధనలో ఫోరెన్సిక్‌ కీలకం

May 13 2026 1:26 AM | Updated on May 13 2026 1:26 AM

కర్నూలు(హాస్పిటల్‌): నేర పరిశోధనల్లో ఫోరెన్సిక్‌ విభాగం వైద్యులు ఇచ్చే నివేదికే కీలకమని కేఎంసీ ఫోరెన్సిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ బ్రహ్మాజీ మాస్టర్‌ చెప్పారు. జాతీయ ఫోరెన్సిక్‌ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం కళాశాల ఫోరెన్సిక్‌ విభాగంలో కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్‌ బ్రహ్మాజీ మాస్టర్‌ మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే ప్రస్తుతం పోస్టుమార్టం చేయడంలో సమూల మార్పులు వచ్చాయన్నారు. ప్రజలకు మేలు చేసేలా సేవలందించాలని, అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటేనే పోస్టుమార్టం చేయాలని జూనియర్‌ వైద్యులకు సూచించారు. ఫోరెన్సిక్‌ వైద్యులు సాహిల్‌, హరీష్‌, సురేఖ, పీజీలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement