కష్టపడిన చదివిన విద్యార్థుల ఆశల్లో ఎన్‌టీఏ నీళ్లు పోసింది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించకుండా పేపర్ లీకేజీ అంటూ పరీక్షను రద్దు చేసి విద్యార్థుల్లో ఆందోళన పుట్టించింది. కేవలం నీట్ పరీక్షను రద్దు చేసి రీఎగ్జామ్ పెట్టి చేతులు దులుపుకోవడం కాదు. ఈ పేపర్ లీక్‌ల వెనుక ఉన్న అసలు దొంగలను పట్టుకొని కఠినంగా శిక్షించాలి. పరీక్షల నిర్వహణలో విశ్వసనీయత కోల్పోతే ప్రతిభా వంతులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. – రాజు నాయుడు, ఆర్‌వీఎఫ్ అధ్యక్షుడు, నంద్యాల


