● మంత్రాలయం రైల్వేస్టేషన్ తనిఖీలో
డీఆర్‌ఎం
మంత్రాలయం రూరల్: రైల్వే స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచాలని గుంతకల్లు డివిజిన్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) చంద్ర ఎస్.గుప్తా అధికారులను ఆదేశించారు. డీఓఎం శ్రవణ్‌తో కలసి బుధవారం ఆయన మంత్రాలయం రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేశారు. అక్కడ స్టేషన్ పరిసరాల పరిశుభ్రతపై ఆరా తీసి మాట్లాడారు. శ్రీరాఘవేంద్రస్వామి భక్తులకు, ప్రయాణికులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్థానిక రైల్వే అధికారులకు సూచించారు. రెండు ప్లాట్‌ఫాంలకు ఎక్స్‌వేటర్లు మంజూరయ్యాయన్నారు. త్వరలో వాటి ఏర్పాటుకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ డీసీఎం ఎన్ మనోజ్, రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ సిద్ధారెడ్డి పాల్గొన్నారు.


