యువకుడిపై హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

యువకుడిపై హత్యాయత్నం

May 17 2026 7:08 AM | Updated on May 17 2026 7:08 AM

● పెట్రోల్‌ పోసి నిప్పంటించిన వైనం ● ప్రేమ వ్యవహారమే కారణం ఏపీ ఫైబర్‌ అధ్వానం

● పెట్రోల్‌ పోసి నిప్పంటించిన వైనం ● ప్రేమ వ్యవహారమే కారణం

మధ్యాహ్నం వరకు ఎండలు.. సాయంత్రానికి వానలు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉదయం నుంచి మధ్యా హ్నం 4 గంటల వరకు బానుడి భగభగలు కొనసాగాయి.. సాయంత్రానికి వాతావరణంలో మార్పులు. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, గాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. కర్నూలులో దాదా పు ఒక సెంటీమీటరు వర్షం కురిసింది. పలు మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు పడటంతో వాతావరణం చల్లబడింది. గాలుల తీవ్రతకు మామిడి పంటకు అపార నష్టం వాటిళ్లింది. శనివారం చిప్పగిరిలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. కౌతాళలో 42.8, మంత్రాలయంలో 42.5, బండిత్మకూరులో 42.5, పెద్దకడుబూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లాల్లో 42.3 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ముగ్గురు ఏడీఏలకు పదోన్నతి

కర్నూలు(అగ్రికల్చర్‌): వ్యవసాయ శాఖలో ముగ్గురు ఏడీఏలకు పదోన్నతులు లభించా యి.ఈ మేరకు డీపీసీ ఖరారు అయింది. రాష్ట్రం మొత్తం మీద 64 మంది ఏడీఏలకు పదోన్నతులు లభించగా.. ఇందులో కర్నూలు జిల్లాలో ముగ్గురు ఏడీఏలు ఉన్నారు. కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, భూ సంరక్షణ విభాగం ఆదోని ఏడీఏగా పనిచేస్తున్న సంధ్యారాణి, పత్తికొండ ఏడీఏ మోహన్‌ విజయ్‌ లకు డిప్యూటీ డైరెక్టర్లుగా పదోన్నతులు లభించాయి. ఈ నెల చివరిలోగా పదోన్నతి పొందిన ఏడీఏలకు పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉంది.

చానళ్లు రావడం లేదని నిరసన

ఆదోని అర్బన్‌: ఏపీ ఫైబర్‌లో ఇంటర్నెట్‌ మాత్రమే వస్తుందని, చానళ్లు రావడం లేదని శనివారం స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయ పరిపాలనాధికారికి ఏపీ కేబుల్‌ ఆపరేటర్‌ జేఏసీ నాయకులు శ్రీనివాసులు, గోపాల్‌, యువరాజ్‌, మధు, ప్రకాష్‌, మల్లికార్జున, బాబా వినతి పత్రం అందించారు. అనంతరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ముందు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత మూడు రోజుల నుంచి ఏపీ ఫైబర్‌లో ఇంటర్నెట్‌ మాత్రమే వస్తుందని, చానళ్లు రాకపోవడంతో ఫైబర్‌ కేబుల్‌ వినియోగదారులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈరోజు, రేపు అని వినియోగదారులకు సమాధానం చెప్పలేక పోతున్నామని, ఇప్పటికై నా ప్రభుత్వం ఫైబర్‌లో చానళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

పిడుగుపాటుతో మహిళ మృతి

కర్నూలు (సిటీ): కర్నూలు రూరల్‌ మండల పరి ధిలోని పి.రుద్రవరం గ్రామానికి చెందిన ఓ మహి ళ శనివారం సాయంత్రం పిడుగుపాటు కు గురై మృతిచెందారు. మాబు ఉన్నిసా(48) అనే మహి ళ తన ముగ్గురు పిల్లలతో కలసి పనులకు వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో ఈదురుగాలులు, వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడింది. ఘటనలో మాబు ఉన్నిసా అక్కడికక్కడే మృతిచె ందారు. మిగిలినవారికి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ఆదిమూలపు సతీష్‌ ఆసుప త్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఉయ్యాలవాడ: తుడుమలదిన్నె గ్రామానికి చెందిన ఇమ్రాన్‌ అనే యువకుడిపై హత్యాయత్నం జరిగింది. శనివారం రాత్రి మాయలూరు గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసు లు తెలిపిన వివరాల మేరకు.. తుడుమలదిన్నె గ్రామానికి చెందిన ఓ యువతితో ఇమ్రాన్‌కు ప్రేమ వ్యవహారం వుండేది. వీరిద్దరూ తరచుగా ఫోన్లలో మాట్లాడుకునే వారు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఆగ్రహించిన యువతి తండ్రితో పాటు మరో ఐదుగురు కలిసి తుడుమలదిన్నె గ్రామంలోనే ఇమ్రాన్‌పై క్రికెట్‌ బ్యాట్‌తో దాడి చేయడానికి యత్నించారు. వారి నుంచి తప్పించుకుని మాయలూరు వైపు పరుగులు తీశాడు. రైల్వే ట్రాక్‌ సమీపంలోకి రాగానే వెంబడిస్తున్న యువతి కుటుంబసభ్యులకు పట్టుబడ్డాడు. వారు వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను అతడిపై పోసి నిప్పంటించారు. శరీరంపై మంటలకు తాళలేక రోడ్డు పక్కన సమీపంలో ఉన్న నీటిగుంతలోకి ఇమ్రాన్‌ దూకాడు. కేకలు వేస్తుండడంతో అటుగా వెళ్తున్న వారు గమనించి పైకి తీసుకొచ్చి 108లో కోవెలకుంట్ల ఆసుపత్రికి తరలించారు. విష యం తెలిసిన వెంటనే ఆళ్లగడ్డ రూరల్‌ సీఐ బీవీ రమణ ఆసుపత్రికి చేరుకుని బాధితుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో ఘర్షణలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఏఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డిని సీఐ ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement