అన్నప్రసాద నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ | - | Sakshi
Sakshi News home page

అన్నప్రసాద నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ

May 7 2026 9:20 AM | Updated on May 7 2026 9:20 AM

శ్రీశైల దేవస్థానం

అధికారులకు ఈఓ ఆదేశం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం తయారు చేస్తున్న వంటకాల నాణ్యతపై పట్ట ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో భక్తులకు దేవస్థానం అందిస్తున్న సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ దర్శనం ఏర్పాట్లు, మంచినీటి సదుపాయం, అన్నప్రసాదం, ఉచిత ప్రసాద వితరణ, శౌచాలయాలు, పారిశుద్ద్య నిర్వహణ తదితర మౌలిక వసతులపై భక్తుల నుంచి 90 శాతం సానుకూల స్పందన ఉండాలన్నారు.ఇందుకు అనుగుణంగా ఉద్యోగులు పనిచేయాలని ఆదేశించారు. అన్నప్రసాద వితరణలో ప్రతిరోజు తాజా కూరగాయలను వినియోగించాలన్నారు. వంటశాలలో శుచి, శుభ్రత పాటించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement