ఇస్తారో..లేదో? | - | Sakshi
Sakshi News home page

ఇస్తారో..లేదో?

May 18 2026 9:37 AM | Updated on May 18 2026 9:37 AM

ఇస్తారో..లేదో? సకాలంలో ఇవ్వాలి పది రోజుల్లో విత్తనాలు అందుబాటులోకి వస్తాయి

మేం ప్రతి ఏటా వేరుశనగ సాగు చేస్తాం. ఈ సారి కూడా రెండు ఎకరాల్లో సాగు చేయాలనే లక్ష్యంతో భూములను సిద్ధం చేసుకున్నాం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా మే 15 నుంచే వేరుశనగతో సహా అన్ని రకాల విత్తనాలను సబ్సిడీపై ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరస్థితులు లేవు. ఈ సారి సబ్సిడీపై విత్తనాలు ఇస్తారో..లేదో? మరో నాలుగైదు రోజుల్లో విత్తనాలు అందుబాటులో ఉంచకపోతే బ్లాక్‌లో కొనాల్సి వస్తుంది.

– బీమా నాయక్‌, మీటేతండా, తుగ్గలి మండలం

మాకు నీటి వసతి ఉంది. బోరు కింద మూడు ఎకరాల్లో వేరుశనగ సాగుకు సిద్ధమయ్యాం. ఈ నెల 20వ తేదీలోపు నీటి వసతి కింద వేరుశనగ వేసుకుంటే బాగా కలసి వస్తుంది. సకాలంలో సబ్సిడీపై వేరుశనగ పంపిణీ చేస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆలస్యం అయితే బ్లాక్‌లో కొనుగోలు చేయకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. వేరుశనగతో పాటు ముందస్తుగా కంది కూడా సాగు చేస్తాం. వేరుశనగతో పాటు కందులు, ఇతర విత్తనాలు సబ్సిడీపై పంపిణీ చేయాలి.

– నరసింహులు, బైన్‌దొడ్డి గ్రామం,

కోడుమూరు మండలం

ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి సబ్సిడీపై వేరుశనగ పంపిణీకి చర్యలు చేపట్టాం. ఇప్పటికే ప్రభుత్వం జిల్లాల వారీగా వేరుశనగతో పాటు పచ్చి రొట్ట, ఇతర విత్తనాల అలాట్‌మెంటు కూడా ఇచ్చింది. వేరుశనగ ధర, సబ్సిడీలు కూడా ఖరారయ్యాయి. వేరుశనగను సిద్ధం చేయాలని ఇప్పటికే ఏపీసీడ్స్‌కు ఆదేశాలు ఇచ్చాం. మరో పది రోజుల్లో వేరుశనగను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. చిన్న సమస్యలు ఉంటే అన్ని మూడు రోజుల్లో సర్దుకుంటాయి.

– పీఎల్‌ వరలక్ష్మి,

జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు

Advertisement
 
Advertisement
Advertisement