పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు

May 15 2026 12:07 PM | Updated on May 15 2026 12:07 PM

పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు

మంత్రి టీజీ భరత్‌ అనుచరులు ప్రతి డిపార్టుమెంట్‌లో కలెక్షన్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి, మున్సిపాల్టీలో, మద్యం, బియ్యం, తదితర వాటిల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు. కర్నూలు అభివృద్ధిని మంత్రి పూర్తిగా విస్మరించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప టీడీపీ పాలనలో ఏమీ కనిపించడం లేదు. ప్రతిపక్షంలో తొమ్మిదేళ్లు ప్రజల పక్షాన పోరాటం చేశాం. పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

– హఫీజ్‌ఖాన్‌, కర్నూలు మాజీ ఎమ్మెల్యే

Advertisement
 
Advertisement
Advertisement