
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ నుంచి మరో యువ సంచలనం క్రికెట్ ప్రపంచానికి పరిచియమయ్యాడు. 18 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ ఉదవ్ మోహన్ తన డీపీఎల్ అరంగేట్రంలోనే సత్తాచాటాడు. ఈ మెగా టోర్నీలో పురానీ దిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న మోహన్.. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఔటర్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగాడు.
మోహన్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మోహిత్ పన్వర్, ధ్రువ్ సింగ్, సిద్ధాంత్ శర్మ , హర్ష్ త్యాగి, శివమ్ శర్మ వంటి కీలక వికెట్లను మోహన్ సాధించాడు.
ఉదవ్ ఇటీవలే భారత అండర్-19 జట్టుకు కూడా ఎంపికయ్యాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా అండర్-19తో జరగనున్న మల్టీ ఫార్మాట్ సిరీస్‌లలో వైభవ్ సూర్యవంశీ, అయూష్ మాత్రేతో కలిసి మోహన్ ఆడనున్నాడు. మోహన్ ఇంకా ఫస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేయలేదు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలంలో అతడిని పురానీ దిల్లీ రూ. 6.60 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం తొలి మ్యాచ్‌లోనే మోహన్ చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పురానీ దిల్లీపై 82 పరుగుల తేడాతో ఔటర్ ఢిల్లీ వారియర్స్ విజయం సాధించింది. 149 పరుగుల లక్ష్య చేధనలో పురానీ దిల్లీ 66 పరుగులకే కుప్పకూలింది. ఔటరీ ఢిల్లీ బౌలర్లలో సుయూష్ శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. శౌర్య మాలిక్ మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ వారియర్స్ 148 పరుగులకు ఆలౌటౌటైంది. పురానీ ధిల్లీ బౌలర్లలో మోహన్‌తో పాటు ప్రషార్, దాదర్ తలా రెండు వికెట్లు సాధించారు.
Udhav Mohan is on fire! 🔥
Udhav Mohan | Outer Delhi Warriors | Purani Dilli-6 | Delhi Premier League 2025 | #Delhi #DPL #DPL2025 #Cricket #T20 pic.twitter.com/MTMhiNlQlA— Delhi Premier League T20 (@DelhiPLT20) August 5, 2025
చదవండి: Stuart Broad: టీమిండియా నుంచి ఆరుగురు.. గిల్‌కు చోటు లేదు!