30 ఎకరాల భూమి కొడుకులకు పంచింది.. | Old Couple Incident In Sangareddy | Sakshi
Sakshi News home page

30 ఎకరాల భూమి కొడుకులకు పంచింది..

Oct 1 2026 10:54 AM | Updated on Oct 1 2026 11:10 AM

Old Couple Incident In Sangareddy

సంగారెడ్డి జిల్లా: ఆస్తులు పంచి ఇచ్చినా కుమారులు పోషించడం లేదని వృద్ధ దంపతులు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం చాప్టా(కె) గ్రామంలో చోటుచేసుకుంది. ఖేడ్‌ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముంగె నర్సారెడ్డి (88), అంజమ్మ (85) దంపతులకు ముగ్గురు కుమారులు సిద్దారెడ్డి, కిష్టారెడ్డి, సంగారెడ్డి.

ఇద్దరు కుమారులు గ్రామంలో వ్యవసాయం చేస్తుండగా రెండో కుమారుడు హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. గ్రామంలో ఉన్న 30 ఎకరాల వ్యవసాయ భూమి ఇద్దరు కుమారులకు పంచి ఇచ్చినా తమను సాకక పోవడంతో మనస్తాపానికి గురయ్యారు. కొడుకుల తీరుతో అవమానంగా భావించిన దంపతులు గ్రామ శివారులోని తమ వ్యవసాయ భూమిలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement