జిల్లాలో నాలుగు కొత్త బార్లకు టెండర్లు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో నాలుగు కొత్త బార్లకు టెండర్లు

Oct 1 2026 9:39 AM | Updated on Oct 1 2026 9:39 AM

జిల్లాలో నాలుగు కొత్త బార్లకు టెండర్లు జిల్లాలో నేటి నుంచి పోలీస్‌యాక్ట్‌ చెరకు క్రషింగ్‌కు ఏర్పాట్లు చేయాలి రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపిక బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

సంగారెడ్డి: జిల్లాలో నాలుగు కొత్త బార్ల ఏర్పాటుకు ఎకై ్సజ్‌శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. బార్‌ లైసెన్స్‌లు మంజూరు చేసేందుకు అర్హత, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులు సమర్పించాలని ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 12 వరకు దరఖాస్తుల స్వీకరణ, 16న నిబంధనల ప్రకారం డ్రా తీయనున్నట్లు చెప్పారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని, మిగితా వివరాలకు జిల్లా ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

సంగారెడ్డిజోన్‌: శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో గురువారం నుంచి నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీస్‌యాక్ట్‌ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నా లు, రాస్తారోకోలు, నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టకూడదని హెచ్చరించారు.

జహీరాబాద్‌: జహీరాబాద్‌ జోన్‌ పరిధిలో సాగులో ఉన్న చెరకు పంట క్రషింగ్‌ కోసం ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ నరోత్తం డిమాండ్‌ చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జోన్‌ పరిధిలో 10 లక్షల టన్నుల చెరకు పంట ఉత్పత్తి కానుందని, రాయికోడ్‌లోని గోదావరి–గంగా కర్మాగారం 2 లక్షల టన్నుల చెరకును గానుగాడిస్తుందన్నారు. మిగితా చెరకును ఎక్కడకు తరలిస్తారనే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. ఇప్పటికే ట్రైడెంట్‌ కర్మాగారంలో క్రషింగ్‌ కొనసాగడం లేదని, ఈ సీజన్‌లో కూడా ప్రారంభిస్తారా లేదా అనే విషయంలో స్పష్టత లేదన్నారు. పెరిగిన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని టన్నుకు రూ.5,500 ధర నిర్ణయించాలని కోరారు. సమావేశంలో రైతులు, బీఆర్‌ఎస్‌ నాయకులు గోపాల్‌, శివకుమార్‌, రాంచంద్రారెడ్డి, ఈశ్వరప్ప, శంకరయ్య, స్వామిదాస్‌, మల్లేష్‌, పవన్‌ రాథోడ్‌ పాల్గొన్నారు.

నారాయణఖేడ్‌: సిద్దిపేట జిల్లా చేర్యాలలో జరిగిన ఉమ్మడి మెదక్‌ జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ హ్యాండ్‌బాల్‌ క్రీడా పోటీల్లో ఖేడ్‌ మైనార్టీ బాలుర గురుకుల ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. అండర్‌–17 విభాగంలో గణేశ్‌, వంశీ, అండర్‌ –14 విభాగంలో ఆదర్శ్‌, కుమార్‌ సత్తాచాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికై న విద్యార్థులను సిద్దిపేట జిల్లా ఎస్‌జీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, మైనార్టీ గురుకుల పాఠశాల ప్రదానోపాధ్యాయులు రాములు, వ్యాయామ ఉపాధ్యాయులు అజీజ్‌, సంతోష్‌, సిబ్బంది అభినందించారు.

కల్హేర్‌(నారాయణఖేడ్‌)/కంగ్టి: పోలీసులు బా ధ్యతగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ సూచించారు. బుధవారం సిర్గాపూర్‌ పోలీస్టేషన్‌ తనిఖీ చేసి రికార్డులు తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఏస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐలు మహేశ్‌, రవిగౌడ్‌ పాల్గొన్నారు. అనంతరం కంగ్టి సర్కిల్‌ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలతో పాటు అయా భూముల జప్తు కోసం సిఫారస్సు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement