ఐఐటీహెచ్‌తో బీబీనగర్‌ ఎయిమ్స్‌ జత | - | Sakshi
Sakshi News home page

ఐఐటీహెచ్‌తో బీబీనగర్‌ ఎయిమ్స్‌ జత

Oct 1 2026 9:39 AM | Updated on Oct 1 2026 9:39 AM

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఆరోగ్య సంరక్షణ రంగంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరిచడంలో ఏఐ వినియోగం, వైద్య నైపుణ్యాలకు ఆధునిక సాంకేతికత మేళవింపు వంటి అంశాలపై ఐఐటీ హైదరాబాద్‌, ఉన్నత వైద్య సంస్థ బీబీ ఎయిమ్స్‌లు కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు ఐఐటీహెచ్‌ ప్రొఫెసర్లు బీబీనగర్‌ ఎయిమ్స్‌ వైద్య నిపుణులు బుధవారం ఐఐటీహెచ్‌లో సమావేశమయ్యారు. బయోమెడికల్‌ సైన్సెస్‌, డిజిటల్‌ హెల్త్‌కేర్‌ వంటి అంశాలతో పాటు క్లినికల్‌ అవసరాలకు అనుగుణమైన సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడంలో ఈ రెండు సంస్థలకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ఏఐ, ఔషధ ఆవిష్కరణలు, మాలిక్యూలర్‌ బయాలజీ, బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌, వైద్య పరికరాలు, ఇమేజింగ్‌, సెన్సార్లు, నానో, డిజిటల్‌ టెక్నాలజీలో ఐఐటీ హైదరాబాద్‌ కీలక పరిశోధనల చేస్తోంది. బీబీనగర్‌ ఎయిమ్స్‌ అంటువ్యాధులు, ఆంకాలజీ, ఆర్థోడాంటిక్స్‌, ఆర్థోపెడిక్స్‌ వంటి వైద్యాంశాల్లో నైపుణ్యం కలిగిన నిపుణులు ఉన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మెరుగు పరచడం కోసం ఈ రెండు సంస్థలు ములుగులోకి సమ్మక్క, సారక్క సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీతో కూడా కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. సమావేశంలో ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీ.ఎస్‌.మూర్తి, బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఈడీ ఫ్రొఫెసర్‌ అమిత్‌ అగర్వాల్‌, ఫ్రొఫెసర్‌ జి.నరహరిశాస్త్రి, రీసెర్చ్‌ డీన్‌ ప్రొఫెసర్‌ రాహుల్‌ నారంగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement