గతేడాది థియేటర్లలో రిలీజై ఆకట్టుకున్న 'రాజు వెడ్స్ రాంబాయి'లో హీరోగా నటించి, పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసిన అఖిల్ రాజ్.. డెలివరీ బాయ్‌ని కొట్టడం, అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడం తెలిసిందే. అయితే తొలుత అందరూ హీరోని విమర్శించారు. కానీ తర్వాత అఖిల్ తన వెర్షన్ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. తన తల్లిని తిట్టడం వల్లే డెలివరీ బాయ్‌ని కొట్టానని అన్నాడు. ఇది వివాదంగా మారడంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
(ఇదీ చదవండి: నిజమేంటో తెలుసుకోండి.. డెలివరీ బాయ్ వివాదంపై అఖిల్ రాజ్)
ఇక అఖిల్ రాజ్.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పలువురు డెలివరీ బాయ్స్ కూడా అక్కడికి చేరి ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మంగళవారం అఖిల్.. తన తల్లిదండ్రులతో కలిసి కారులో గుడికి వెళ్తుండగా కొండాపూర్‌లో డెలివరీ బాయ్ రమేశ్, తన అనుచరులతో కలిసి కారుని చుట్టుముట్టి రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. పోలీసులు అక్కడికి చేరుకుని డెలివరీ బాయ్‌తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఇరువర్గాల వాదనలను విచారిస్తున్నారు.
(ఇదీ చదవండి: మహేశ్ బాబు.. మరో 80 రోజులు మాత్రమే)
నాపై దాడికి యత్నించారు.. హీరో అఖిల్‌రాజ్ ఫిర్యాదు..
డెలివరీ బాయ్‌తో జరిగిన గొడవ వివాదాస్పదంగా మారడంతో, సినీనటుడు అఖిల్‌రాజ్ గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు.
కొండాపూర్‌లో కొంతమంది తన కారును అడ్డగించి దాడికి ప్రయత్నించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరోవైపు, డెలివరీ బాయ్‌పై… pic.twitter.com/00VvsuWPPv— ChotaNews App (@ChotaNewsApp) June 30, 2026


