మరో 80 రోజులు మాత్రమే | Varanasi: SS Rajamouli confirms 80 days shoot left for Mahesh Babu starrer wrap-up | Sakshi
Sakshi News home page

మరో 80 రోజులు మాత్రమే

Jul 1 2026 4:12 AM | Updated on Jul 1 2026 8:23 AM

Varanasi: SS Rajamouli confirms 80 days shoot left for Mahesh Babu starrer wrap-up

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్‌  అండ్‌ టైమ్‌ట్రావెల్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రాముడిగా, రుద్రగా ద్వి పాత్రాభినయం చేస్తున్నారు మహేశ్‌బాబు. మందాకిని  పాత్రలో ప్రియాంకా చో ప్రా, కుంభ  పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్  , శివ భక్తుడి  పాత్రలో ప్రకాష్‌ రాజ్‌ నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌కు చిన్న బ్రేక్‌ పడింది. హీరో మహేశ్‌బాబు విహారయాత్రలో భాగంగా విదేశాల్లో ఉండగా, దర్శకుడు రాజమౌళి ప్యారిస్‌లో ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన గత చిత్రాలు ‘ఈగ, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలు ప్యారిస్‌లోని థియేటర్స్‌లో ప్రదర్శితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా రాజమౌళి ‘వారణాసి’ సినిమా అప్‌డేట్స్‌ను వెల్లడిస్తున్నారు. ‘వారణాసి’  సినిమాకు సంబంధించిన మేజర్‌ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని, అక్టోబరు కల్లా మొత్తం షూటింగ్‌ పూర్తవుతుందని రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే.

తాజాగా 80 రోజులు షూటింగ్‌ జరిపితే ‘వారణాసి’ సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని రాజమౌళి తెలిపారు. ఇక ఈ నెల మూడోవారంలో ‘వారణాసి’ సినిమా కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ ప్రారంభం అవుతుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఈ లోపు రాజమౌళి, మహేశ్‌ బాబు తమ కార్యక్రమాలను విదేశాల్లో పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు రానున్నారు. ఎస్‌ఎస్‌ కార్తికేయ, కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న ‘వారణాసి’ ఏప్రిల్‌ 7న రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement