
మింతా దేవి టీషర్టులతో ప్రియాంక, ఆర్. సుధ
విపక్షాల నినాదాలు, విమర్శలతో స్తంభించిన పార్లమెంట్
ఆందోళనల నడుమే పలు బిల్లులకు మోక్షం..
బిహార్‌లో 35 ఏళ్ల మహిళా ఓటరు వయసును 124 ఏళ్లుగా ఎస్‌ఐఆర్‌లో ఈసీ పేర్కొనడంపై పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష ఎంపీల నిరసన
న్యూఢిల్లీ: బిహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) అంశం మరోమారు పార్లమెంట్‌ను కుదిపేసింది. కొన్ని బిల్లులకు మోక్షం లభించడం మినమా సభలో కీలక అంశాలేవీ చర్చలకు నోచుకోలేదు. ఎస్‌ఐఆ ర్‌పై చర్చ జరపాలన్న డిమాండ్ నుంచి విపక్ష సభ్యులు మొండిపట్టు పట్టడంతో పలు మార్లు వాయిదాల తర్వాత లోక్‌సభ, రాజ్యసభలు ఆగస్ట్ 18వ తేదీకి వాయిదా పడ్డాయి. స్వాతంత్రదినోత్స వేడుకలను పురస్కరించుకుని పార్లమెంట్ ఉభయసభల్లో సభా కార్యక్రమాలకు ఆగస్ట్ 13 నుంచి 17వ తేదీదాకా తాత్కాలిక విరామం ఇచ్చారు.
లోక్‌సభ మంగళవారం ఉదయం ప్రారంభంకాగానే విపక్షసభ్యులు ఎస్‌ఐఆర్ అనుకూల నినాదా లిస్తూ సభ సజావుగా సాగకుండా అడ్డుకున్నారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. దీంతో తర్వాత ఇదే పునరా వృతమైంది. దీంతో సభను మధ్యా హ్నం రెండు గంటలకు వాయి దావేశారు. ఇన్‌కమ్‌ట్యాక్స్ బిల్లులకు పార్ల మెంట్ ఆమోదం ఆరు దశా బ్దాలనాటి పాత ఇన్‌క మ్‌ట్యాక్స్ చట్టం,1961కు బదులుగా తీసుకొచ్చిన నూతన ఆదాయపన్ను చట్టా నికి పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది.
కొత్త పన్ను రేట్లు మోపడంలేదని, కేవలం కఠిన పదాలను తొలగించి సరళమైన పదాలతో బిల్లును తీసు కొచ్చామని రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 1961నాటి చ ట్టంలో 819 సెక్షన్లు ఉంటే వాటి ని 536కు కుదించాం. పదేపదే ప్రస్తావిస్తూ ఉన్న పదాలతో పాటు కఠిన పదాలను తొలగించాం. దీంతో బిల్లులోని 5.12 లక్షల పదాలకు ఏకంగా 2.6 లక్షల పదాలకు తగ్గాయి. 39 కొత్త టేబుళ్లను, 40 కొత్త ఫార్ములా లను జతచేశాం’’ అని సీతారామన్ పేర్కొన్నారు. ట్యాక్సేషన్ ట్టాలు (సవరణ) బిల్లు, 2025సహా మొత్తంగా ఆరు బిల్లులను పార్లమెంట్ ఆమోదించింది.
పేపర్లు చింపి..
అంతకముందు లోక్‌సభలో కొంత అనూహ్యఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐఆర్ సంబంధ నినాదాలు చేస్తూ విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి కొన్ని పేపర్లు చింపేసి అధ్యక్ష పీఠం వైపు చిందరవందరగా విసిరారు. దీనిపై ఎన్‌డీఏ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మింతా దేవి ఫొటో టీ–షర్ట్‌లు ధరించి నిరసన
35 ఏళ్ల బిహార్ మహిళా ఓటరు వయసును 124 ఏళ్లుగా ఎస్‌ఐఆర్‌లో పేర్కొనడాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష ఎంపీలు వినూత్న నిరసనకు దిగారు. మింతా దేవి ఫొటో ముద్రించిన తెలుపురంగు టీ–షర్ట్‌లను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ సహాపలువురు ఎంపీలు ధరించి ఈసీ, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. 124 నాట్‌అవుట్ అని ఆ టీ–షర్ట్‌పై రాసి ఉంది.
మన ఓటు, మన హక్కు, మన పోరాటం అనే బ్యానర్‌తో ముందుకు కదిలారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌సోనియాగాంధీ, టీఎంసీ నేత డిరేక్ ఓబ్రియాన్, డీఎంకే నేత టీఆర్ బాలు, ఎన్‌సీపీ(ఎస్పీ) సుప్రియాసూలే తదితర ఎంపీలు పార్లమెంట్ మకరద్వారం వద్దకు చేరుకుని ఎస్‌ఐఆర్‌ను తక్షణం నిలిపివేయాలని నినాదాలిచ్చారు. ఎస్‌ఐఆర్ అంశాన్ని విపక్ష ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావించడం ఇది 15వ రోజు.