ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తుకు అవకాశం
పూర్తి చేసిన ఫారాలు వెంటనే ఇవ్వాలంటున్న అధికారులు
వేగం పుంజుకోని డిజిటలైజేషన్
ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిస్థితి ఇదీ..
హైదరాబాద్: ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా గత నెల 25 నుంచి ఇంటింటికీ వెళ్లి బీఎల్‌ఓలు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. ఆగస్టు 3 నాటికి పూరించిన ఫారాలను తిరిగి అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో భర్తీ చేసిన ఫారాలు బీఎల్‌ఓలకు సరిగా అందకపోవడంతో డిజిటలైజేషన్ మందగించింది.
మరికొంతమంది ఎక్కడో ఉండి దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. వారికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. స్వల్ప వ్యవధిలో సిటిజన్ సరీ్వస్ పోర్టల్ వేదికగా దరఖాస్తు చేసుకునే సదుపాయం కూడా కలి్పంచారు. మొబైల్ యాప్, వెబ్‌సైట్ ద్వారా ‘సర్’ఫారాలను పూర్తి చేయవచ్చు. ఓటరు జాబితాలో ఉన్న పేరు, ఆధార్ కార్డులో ఉన్న పేరు ఒకేలా ఉండాలి. సంప్రదించాల్సిన వెబ్‌సైట్ ఓటర్స్.ఈసీఐ.జీఓఈ.ఇన్.
విదేశీయులకు కూడా అవకాశం..
ప్రవాస భారతీయులకు ఫర్ ఓవర్సీస్ ఓన్లీ అనే ఆప్షన్ కేటాయించారు. ఫోన్ నెంబర్, ఓటరు కార్డు అనుసంధానం కాకపోతే ఫారం–8 ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు. ప్లేస్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి ఈసీఐఎన్‌ఈటీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని కూడా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
డిజిటలైజేషన్ వివరాలు...
ఖైరతాబాద్ నియోజకవర్గంలో మొత్తం 245 పోలింగ్ బూత్‌లు ఉండగా 245 మంది బీఎల్‌ఓలు పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,93,667 మంది ఉండగా, ఇప్పటివరకు 40.32 శాతం డిజిటలీకరణ మాత్రమే పూర్తయింది. ఇప్పటివరకు 1,18,406 ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేశారు. ఇంకో 1,68,513 ఫారాలు డిజిటలీకరణ చేయాల్సి ఉంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ బూత్‌లు ఉండగా, 407 మంది బీఎల్‌ఓలు పనిచేస్తున్నారు. మొత్తం ఓటర్లు 40,6729 కాగా, ఇప్పటివరకు 1,55,405 (38.21 శాతం) డిజిటలైజేషన్ పూర్తిచేశారు. ఇంకా 2,34,735 (57.71 శాతం) ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలీకరణ పూర్తికావాల్సి ఉంది.


