ఏపీ సచివాలయంలో వింత ఆంక్షలు | Bizarre restrictions at the AP Secretariat | Sakshi
Sakshi News home page

ఏపీ సచివాలయంలో వింత ఆంక్షలు

Jun 15 2026 2:56 PM | Updated on Jun 15 2026 7:18 PM

Bizarre restrictions at the AP Secretariat

సాక్షి,విజయవాడ: ఏపీ సచివాలయంలో వింత ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. సచివాలయంలో వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడకూడదని ఆంక్షలు విధించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఆంక్షలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమవారం (జూన్‌ 15) ఎస్‌ఐఆర్‌లో పలు సమస్యలపై వైఎస్సార్‌సీపీ నేతలు ఎమ్మెల్సీ లు అప్పిరెడ్డి, రాహుల్లాలు, లీగల్ సెల్ మనోహర్ సహా పార్టీ నేతలు ఎన్నికల కమిషన్ సీఈవోకి వినతిపత్రం ఇచ్చేందుకు సచివాలయానికి వచ్చారు. ఎన్నికల కమిషన్‌ సీఈవోకి లేఖ ఇచ్చారు.

అనంతరం లేఖపై మీడియాతో మాట్లాడేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రయత్నం చేశారు. అయితే, సెక్రటరియేట్‌లో మీడియాతో మాట్లాడడంపై ఆంక్షలు అమలులో ఉన్నాయంటూ వారిని పోలీసులు అధికారులు అడ్డుకున్నారు. ఆ ఆంక్షలపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement