
బిహార్ ‘సర్’ను సమర్థించిన సుప్రీంకోర్టు
ఓటరు జాబితా ఎప్పుడూ ‘స్థిరం’గా ఉండకూడదు
మార్పులు, చేర్పులు, సవరణలు అవసరమే
11 పత్రాలను అనుమతించడం ఓటరుకు ప్రయోజనకరమే
న్యూఢిల్లీ: విపక్ష పార్టీల విమర్శలు, అత్యంత అభ్యంతరాలతో వివాదాస్పదంగా మారిన బిహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్–సర్)) సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలుచేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటరు జాబితాలో మార్పు లు, చేర్పులు, సవరణలు చేపట్టడం సరైన ప్రక్రియేనని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జో య్‌మాల్య బాగ్చీల సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
‘‘ఓటర్ల జాబితా ఎప్పు డూ స్థిర సంఖ్యతో కొనసాగడం సహే తుకం అనిపించుకోదు. కాలానుగుణంగా అందులో సవరణలు తప్పనిసరి. గతంలో ఓటరుగా నిరూపించుకోవడానికి ఏడు రకాల ధ్రువీక రణ పత్రాలను ఈసీ అనుమతించేది. ఇప్పు డు ఏకంగా 11 రకాల ధ్రువీకరణ పత్రా లను అనుమతిస్తున్నారు. గతంతో పోలిస్తే ఎక్కువ ధ్రువపత్రాలను అనుమతించడం చూస్తుంటే ఈ ప్రక్రియ మరింతగా ఓటరుకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు.
ఓటర్లను జాబితా నుంచి తప్పించేలా ఇది కనిపించట్లేదు’’ అని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఎస్‌ఐఆర్ తప్పులతడకగా ఉందని, దీన్ని వెంటనే ఆపాలంటూ విపక్షాలు ఆందోళన బాట పట్టిన వేల సుప్రీంకోర్టు ఈసీ అనుకూ ల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘అవస రమై నప్పుడు ఓటరు జాబితాకు సవరణలు చేసే సర్వాధికారం ఈసీకి ఉంది. చట్టానికి వ్యతిరే కంగా ఎస్‌ఐఆర్ చేపడుతు న్నారని, దీనిని ఆపేయాలన్న పిటిషనర్ వాదనలను కోర్టు తోసి పుచ్చింది. బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ను వ్యతి రేకిస్తూ రాష్ట్రీయలోక్‌దళ్, కాంగ్రెస్ నేత లు సహా రాజకీయ సంస్కరణ సంస ్థ(ఏడీ ఆర్) సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే.
సవరణ లేకుండా ఎలా?
‘‘బిహార్‌లో మొదలెట్టిన ఎస్‌ఐఆర్‌ను దేశ వ్యాప్తంగా విస్తరించకుండా అడ్డుకోవాలి. ఎస్‌ఐఆర్‌లాంటి ప్రక్రియను ఈసీ గతంలో ఏనాడూ చేపట్టలేదు. అసలు ఇది ఎక్కడ ముగుస్తుందో దేవుడికే తెలియాలి’’ అని ఏడీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ అన్నారు. దీంతో కోర్టు స్పందించింది. ‘‘ మీ తర్కం ప్రకారం ప్రత్యేకంగా ఓటరు సమగ్ర సవరణ చేపట్ట కూడదు. మొట్టమొదటిసారిగా దశాబ్దాల క్రితం సేకరించిన వాస్తవిక ఓటర్ల జాబితాను మాత్రమే కొనసాగించాలంటున్నారు. మా అభిప్రాయం ప్రకారం ఓటరు జాబితా అనేది ఎలాంటి సవరణలు జరపకుండా అలాగే కొనసాగించడం సబబు కాదు.
ఈ జాబితా ఎప్పటికప్పుడు సవరణకు బద్దమై ఉండాల్సిందే. సవరణ చేయకుంటే చనిపోయిన వారి పేర్లను తొలగించేదెలా? వేరే రాష్ట్రానికి వలసవెళ్లిన ఓటర్లు, మరో నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పర్చు కున్న వారి పేర్లను పాత నియోజక వర్గంలో తొలగించొద్దా?’’ అని ధర్మాసనం సూటి ప్రశ్నలు వేసింది. ‘‘ దృవపత్రంగా ఆధార్‌ను అంగీకరించట్లేదని మాకు అర్థమవుతోంది.
కానీ ఏకంగా 11 ఇతర రకాల దృవపత్రాలను అంగీకరిస్తు న్నారుగా?’’ అని పిటిషనర్ల తరఫున హాజరైన మరో న్యాయవాది అభిషేక్ సింఘ్వీని కోర్టు ప్రశ్నించింది. దీనితో పిటిషనర్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ విభేదించారు. ‘‘ధ్రువపత్రాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ అవి పూర్తిస్తాయిలో ఇప్పుడు అందరికీ అందుబాటులో లేవు. ధ్రువపత్రాల్లో ఒకటైన పాస్‌పోర్టు విషయానికే వస్తే రాష్ట్రంలో కేవలం ఒకటి, రెండు శాతం మంది దగ్గర మాత్రమే ఇవి ఉన్నాయి’’అని వాదించారు. దీనిపై కోర్టు స్పందించింది. ‘‘ రాష్ట్రంలో 36,00,000 మందికి పాస్‌పోర్టు ఉంది. ఇది మంచి సంఖ్య మాదిరిగానే కనిపిస్తోంది’’ అని కోర్టు గుర్తుచేసింది.
వాటి మధ్య యుద్ధంలా తయారైంది
‘‘ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21(3) ప్రకారం ఓటరు జాబితాలో ఇప్పుడు సవరణలు అవసరమని ఈసీ భావిస్తే అప్పుడు వెంటనే ప్రత్యేక సవరణ మొదలెట్టే సర్వాధికారం ఈసీకి దఖలుపడింది. వాస్తవానికి ఈ అంశం రాజ్యాంగబద్ధ హక్కుకు, రాజ్యాంగం ద్వారా దఖలుపడిన అధికారానికి మధ్య పోరాటంలా తయారైంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు అభిప్రాయంతో లాయర్ శంకరనారాయణన్ విబేధించారు.
చట్టప్రకారం రాష్ట్రంలో ఏదైనా కేవలం ఒక నియోజకవర్గంలో లేదంటే ఒక నియోజకవర్గంలోని కొంత భాగంలో మాత్రమే జాబితా సవరణ చేపట్టాలి. అంతేగానీ ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సవరణ చేపట్టకూడదు’’ అని వాదించారు. దీనిపై జడ్జి మళ్లీ స్పందించారు. ‘‘ రాజ్యాంగంలోని 324వ అధికరణం ద్వారా ఈసీకి సవరణ అధికారాలు దఖలుపడ్డాయి’’ అని జడ్జి వ్యాఖ్యానించారు.
వెతికే అవకాశం లేకుండా చేశారు
‘‘ముసాయిదా జాబితాలో సెర్చ్ ఆప్షన్‌ను ఈసీ దురుద్దేశంతో తొలగించింది. దీంతో గత జాబితాతో పోలిస్తే ముసాయిదా లిస్ట్‌లో ఎవరి పేర్లను తొలగించారో తెలియకుండా పోయింది. తొలగించిన, మరణించిన, వలసవెళ్లిన వాళ్ల జాబితా తెలీకుండా దాచిపెట్టేందుకే ఈసీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. బెంగళూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో లక్ష నకిలీ ఓట్లను గుర్తించామని రాహుల్‌గాంధీ మీడియా సమావేశంలో ప్రకటించిన మరుసటి రోజే ఈ సెర్చ్ ఆప్షన్ తీసేశారు’’ అని ఎన్‌జీఓ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు.