ఢిల్లీ: ఇప్పటికే బిహార్ రాష్ట్రంలో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యక సమగ్ర సవరణ-SIR(Special Intensive Revision) ను దేశ వ్యాప్తంగా నిర్వహించేందుకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతుంది.. దీనిలో రేపు(సోమవారం, అక్టోబర్ 27వ తేదీ) రాష్ట్రాల ‘SIR’ నిర్వహణ తేదీలను ప్రకటించే అవకాశాలు కనబుడుతున్నాయి. సుమారు 10 నుంచి 15 రాష్ట్రాలకు సర్ నిర్వహించే తదీలను ఖరారు చేయనుంది.
ఇందులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాలు కూడా ఉండనున్నాయి. ఈ మేరకు సీఈసీ రేపు కీలక మీడియా సమావేశంలో ‘సర్’ నిర్వహణ రాష్ట్రాలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మీడియా సమావేశానికి సీఈసీ ఆహ్వారం పంపిన దరిమిలా ‘సర్’పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉండవచ్చు.

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న లేదా జరగబోయే రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ను ఇప్పుడే ప్రారంభించవద్దని నిర్ణయించింది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తలమునకలై ఉంటారు కనుక వాటికి జోలికి వెళ్లకుండా మిగతా రాష్ట్రాల్లో సర్‌ను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.


