ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష.. తెలంగాణలో SIR | CEO Review SIR in TELANGANA | Sakshi
Sakshi News home page

ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష.. తెలంగాణలో SIR

Oct 25 2025 5:38 PM | Updated on Oct 25 2025 6:11 PM

CEO Review SIR in TELANGANA
  • ప్రత్యేక విస్తృత ఓటరు జాబితా సవరణపై సీఈఓ సమీక్ష
  • తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి  సి. సుధర్శన్‌ రెడ్డి

హైదరాబాద్‌, రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ప్రత్యేక విస్తృత ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision–SIR) కార్యక్రమంపై సన్నాహాలను ముఖ్య ఎన్నికల అధికారి సి. సుధర్శన్‌ రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు (DEOs), నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారులు (EROs)*తో సమీక్షించారు.

ఈ సందర్భంగా సీఈఓ సుధర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక విస్తృత సవరణలో భాగంగా చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలు నిర్ణీత గడువులో పూర్తిచేయాలని, ముఖ్యంగా టేబుల్‌టాప్‌ వ్యాయామం వంటి పెండింగ్‌ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం, పోలింగ్‌ స్టేషన్‌ వారీగా పురోగతిని సమీక్షిస్తూ, ఖచ్చితమైన , లోపరహిత ఓటర్ల జాబితా తయారీపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

తదుపరి సమీక్షా సమావేశం నవంబర్‌ 1, 2025న వీడియో కాన్ఫరెన్స్‌ రూపంలో నిర్వహించబడనుందని, అప్పటికి అన్ని పనులు పూర్తవ్వాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్‌ కుమార్‌, ఉప ముఖ్య ఎన్నికల అధికారి హరి సింగ్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇటీవల సుధర్శన్‌ రెడ్డి ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఆధ్వర్యంలో జరిగిన రెండు రోజుల జాతీయ సమావేశంలో పాల్గొన్నట్లు తెలిసింది. ఆ సమావేశంలో ఎన్నికల జాబితా నిర్వహణలో సాంకేతికత వినియోగం, పారదర్శకత పెంపు, ఓటర్ల సేవల మెరుగుదల మరియు ఉత్తమ పద్ధతుల అమలు వంటి అంశాలపై చర్చలు జరిగాయి.

సీఈఓ సుధర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా, తప్పులేని, సమగ్ర ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం ఎన్నికల శాఖ యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

 ఇదీ చదవండి:
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement