క్యాసినో హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. 19 మంది సజీవ దహనం.. భయంతో ఐదో అంతస్తు నుంచి జంప్..

Cambodia Casino Hotel Fire Accident Many Dead Dozens Injured - Sakshi

దక్షిణ ఆసియా దేశం కంబోడియాలోని ఓ క్యాసినో హోటల్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ విషాద ఘటనలో 19 మంది సజీవదహనమయ్యారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పయోపెట్‌లోని గ్రాండ్ డైమెండ్ హోటల్‌లో ఈ ప్రమాదం జరిగింది. అగ్నీ కీలక భారీగా ఎగిసిపడ్డాయి. వందల మంది ‍అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నప్పటికీ మంటలు ఆర్పేందుకు రెండు గంటలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

ప్రమాద సమయంలో మొత్తం 400 మంది క్యాసినోలో ఉన్నారు. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే వారంతా భయంతో పరుగులు తీశారు. కొందరైతే అగ్నిమాపక సిబ్బంది కాపాడేందుకు వెళ్తున్నా ప్రాణభయంతో ఐదో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. ప్రమాద సమయంలో విదేశీయులు కూడా లోపల ఉన్నట్లు తెలుస్తోంది. 

మొత్తం 360 మంది అత్యవసర సిబ్బంది, 11 ఫైరింజన్లు సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే న్యూఇయర్ సందర్భంగా భారీ విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
చదవండి: Viral: జారిపోతున్న కార్లు.. అమెరికా మంచు తుఫాన్ వీడియోలు వైరల్..

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top