బంజారాహిల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం | Fire Accident in Banjara Hills | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

Feb 3 2026 10:52 AM | Updated on Feb 3 2026 12:12 PM

Fire Accident in Banjara Hills

హైదరాబాద్:  బంజారాహిల్స్ రోడ్ నెంబర్‌ 3లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న ఓ ప్రముఖ రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్, గ్యాస్ లీక్ వంటి కోణాల్లో పోలీసులు, ఫైర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement