ముక్కలుగా కోసి.. చెత్తకుప్పలో వేసి | Kamareddy Dumpyard Body Incident | Sakshi
Sakshi News home page

ముక్కలుగా కోసి.. చెత్తకుప్పలో వేసి

Feb 3 2026 9:57 AM | Updated on Feb 3 2026 1:10 PM

Kamareddy Dumpyard Body Incident

కామారెడ్డి క్రైం: ఓ గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా కోసి.. సంచిలో మూటకట్టి చెత్తకుప్పలో వేసిన ఘటన సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. పట్టణంలోని అశోక్‌నగర్‌ కాలనీలోని ఖాళీ ప్రదేశంలో చెత్తాచెదారం వేస్తుంటారు. ఉద యం ఓ సంచిలో పురుషుడికి సంబంధించిన నడుము నుంచి కింది శరీర భాగాన్ని స్థానికులు గమనించారు. 

వారి సమాచారం మేరకు పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే, ఎక్కడో వ్యక్తిని హత్య చేసి మూటను ఇక్కడ పడవేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి శరీరాన్ని రెండు, లేదా మూడు ముక్కలు చేసి ఓ భాగాన్ని ఇక్కడ పడవేసి ఉంటారని అనుమానిస్తు న్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆ«ధారాలతో దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement