బులియన్‌ మార్కెట్‌లో అయోమయం! | - | Sakshi
Sakshi News home page

బులియన్‌ మార్కెట్‌లో అయోమయం!

Feb 3 2026 7:22 AM | Updated on Feb 3 2026 7:22 AM

బులియన్‌ మార్కెట్‌లో అయోమయం!

బులియన్‌ మార్కెట్‌లో అయోమయం!

బులియన్‌ మార్కెట్‌లో అయోమయం!

స్వర్ణకారులకు పని కరువు

చుక్కలు చూపి.. దిగివస్తున్న వెండి

బంగారం, వెండి ధరలు అడ్డగోలుగా పెరిగిపోయి రికార్డుల మీద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా పెరిగిపోయిన ధరలను చూసి సామాన్యులే కాదు ధనవంతులు కూడా బెంబేలెత్తిపోయారు. ఇటీవల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1.86 లక్షలకు చేరింది. త్వరలోనే రూ.2 లక్షలకు చేరుతుందని భావించారు. అయితే మూడు నాలుగు రోజులుగా బంగారం ధరలు పడిపోతూ సామాన్యులకు ఉపశమనం కలిగిస్తున్నాయి. కామారెడ్డి మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల ధర రూ.1.52 లక్షలకు పడిపోయింది. సోమవారం కొంత కోలుకుని రూ.1.57 లక్షలకు చేరుకుంది. అయినా గరిష్ట స్థాయినుంచి సుమారు రూ. 30 వేలు పడిపోయినట్లే.. బంగారం ధర అడ్డగోలుగా పెరిగి అమాంతం పడిపోయిన నేపథ్యంలో మార్కెట్‌లో అయోమయం నెలకొంది. వ్యాపారులతో పాటు కొనుగోలుదారులకూ ఏమీ అర్థం కాని పరిస్థితి నెలకొంది.

కొనుగోళ్లకు ఆచితూచి అడుగులు

ఈనెల మూడో వారంలో శుభముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లతో పాటు ఇతర శుభకార్యాలకు తేదీలు నిర్ణయించుకున్నారు. అయితే ఆభరణాలు చేయించడానికి బంగారం కొనే విషయంలో చాలా మంది ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పెళ్లిళ్ల కోసం ఇప్పటికే బంగారం కొనుగోలు చేసిన వారు ధర పెరిగినా, తగ్గినా ఫరక్‌ పడదన్నట్టుగా ఉంటే, కొందామని వాయిదా వేసుకున్న వారు ధరలను చూసి హడలిపోయారు. ఆలోచిస్తుండగానే ధరలు పడిపోయాయి. ఎప్పుడు పడిపోతాయో, ఎప్పుడు పెరుగుతాయో తెలియని పరిస్థితుల్లో వెనుకడుగు వేస్తున్నారు.

బంగారం, వెండి ధరల్లో నెలకొన్న అయోమయ పరిస్థితుల్లో బంగారం దుకాణాలు వెలవెలబోతున్నాయి. ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని, కొందరు వచ్చి బంగారం, వెండి ధరలు ఎంత అని అడిగి తెలుసుకుని వెళ్తున్నారని పట్టణానికి చెందిన ఓ వ్యాపారి ‘సాక్షి’తో పేర్కొన్నారు. నాలుగైదు రోజులుగా బంగారం మార్కెట్‌లో అయోమయం నెలకొందని అభిప్రాయపడ్డారు. ధర ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. ధరల హెచ్చుతగ్గులతో వ్యాపారులూ ఆందోళనతో ఉన్నారు. అమ్మకాలు తగ్గిపోయి దుకాణాలు వెలవెలబోతుండడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

అడ్డగోలుగా పెరిగిన బంగారం, వెండి ధరలతో ఆభరణాలు తయారు చేయించుకునేవారు తగ్గిపోయారు. దీంతో స్వర్ణకారులకు పని కరువైంది. గతంలో పెళ్లిళ్లకు ఐదు తులాల నుంచి పది తులాల వరకు ఆభరణాలు చేయించేవారు. ఓ స్థాయి ఉన్న వారు 10 తులాల నుంచి 20 తులాల వరకు ఆభరణాలు చేయించుకునేవారు. పేద, మధ్య తరగతి ప్రజలు స్థానికంగా ఉన్న స్వర్ణకారుల వద్ద ఆభరణాలు తయారు చేయించుకుంటే, ఉన్నత వర్గాలు మాల్స్‌కు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. అయితే బంగారం ధరలు పెరిగిన తరువాత పని కరువైందని పలువురు స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వెండి ధర కూడా సరికొత్త రికార్డులను సృష్టించిన తర్వాత అమాంతం పడిపోయింది. మూడు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.4.10 లక్షలకు చేరింది. కనీసం కాళ్లకు మట్టెలు, పట్టీలు కూడా చేయించుకోలేని పరిస్థితి వచ్చిందని పలువురు సామాన్య మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సోమవారం ఉదయం ధర కిలోకు రూ. 2.50 లక్షలకు పడిపోయింది. మధ్యాహ్నానికి కొంత తేరుకుని రూ.2.60 లక్షలకు, సాయంత్రానికి రూ.2.80 లక్షలకు చేరుకుంది. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో సామాన్యులు కాస్త ఊరట చెందుతున్నారు.

ఇటీవలి కాలంలో పూటకో రికార్డు గరిష్టానికి చేరుతూ సామాన్యులకు అందనంతగా పెరిగిపోయిన బంగారం, వెండి ధరలు.. దిగివస్తున్నాయి. అడ్డగోలుగా పెరిగి అమాంతం పడిపోతున్న ఆయా లోహాలను కొనుగోలు చేయడానికి ప్రస్తుతం జనం ఆసక్తి చూపడం లేదు. దీంతో బంగారం దుకాణాలు వెలవెలబోతున్నాయి. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

అడ్డగోలుగా పెరిగి అమాంతం

పడిపోతున్న బంగారం, వెండి ధరలు

కొనుగోలుకు

వెనకాముందవుతున్న జనం

వెలవెలబోతున్న దుకాణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement