‘బాన్సువాడ గడ్డపై కమలం జెండా ఎగరాలి’
బాన్సువాడ : బాన్సువాడ బల్దియాపై కమలం జెండాను ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు పిలుపునిచ్చారు. సోమవారం బాన్సువాడలోని పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్ అభ్యర్థులకు బీఫాంలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. ఎన్నికల ప్రచారానికి రాష్ట్ర ముఖ్య నాయకులు వస్తారన్నారు.
బీజేపీలో చేరిన ఉద్యమకారుడు మహేశ్
బాన్సువాడ : బాన్సువాడకు చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు చాకలి మహేశ్ బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. మహేశ్ 19వ వార్డునుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి ఇంద్రసేనారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కోనాల గంగారెడ్డి, నాయకులు చీదరి సాయిలు, శంకర్‌గౌడ్, చిరంజీవి, శ్రీనివాస్, సాయిరెడ్డి, డాకయ్య, పాశం భాస్కర్‌రెడ్డి, చీకట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.


