హైదరాబాద్: ఖమ్మం జిల్లా వైరాలో సంక్రాంతి పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి సాంబార్‌లో పడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ప్రమాదవశాత్తూ చిన్నారి రమ్మశ్రీ వేడి వేడి సాంబార్‌లో పడటంతో తీవ్ర గాయాలపాలైంది. దాంతో చిన్నారి రమ్మశ్రీని హైదరాబాద్‌కు తీసుకువచ్చి చికిత్స అందించారు.
నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దాంతో చిన్నారి తల్లి దండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బిడ్డను కోల్పోవడంతో వారి బాధ వర్ణనాతీతంగా ఉంది.


