
సాక్షి, తాడేపల్లి: కర్నూలు జిల్లాలో నీటికుంటలో పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందటం పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ర్భాంతి చెందారు. ఉజ్వల భవిష్యత్‌ను పొందాల్సిన విద్యార్థులు ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.
‘‘మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.