ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం | Happy Mother Son Photo then Tragedy 4 of Rajasthan Family | Sakshi
Sakshi News home page

ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం

Jul 3 2025 8:47 AM | Updated on Jul 3 2025 8:48 AM

Happy Mother Son Photo then Tragedy 4 of Rajasthan Family

బార్మర్: ఇద్దరు పిల్లలతో నిండుగా కళకళలాడుతున్న ఆ పచ్చని సంసారాన్ని కుటుంబ కలహాలు చిదిమేశాయి. క్షణికావేశంలో కుటుంబ పెద్ద తీసుకున్న నిర్ణయం స్థానికులకు తీరని ఆవేదనను మిగిల్చింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

బార్మర్‌కు చెందిన కవిత కవిత తన చిన్న కుమారుడు రామ్‌దేవ్‌కు బాలికల దుస్తులు ధరించి,  కళ్లకు కాజల్ పెట్టి, బంగారు ఆభరణాలు వేసి, చూడముచ్చటగా తయారుచేసింది. ఆ తరువాత  వారి కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది. ఆ ఇంటిలోని భర్త, భార్య ఇద్దరు కుమారులు ఇంటికి సమీపంలో ఉన్న నీటి ట్యాంక్‌లోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను శివలాల్‌ మేఘ్వాల్‌ (35), అతని భార్య కవిత (32), కుమారులు బజరంగ్ (9) రామ్‌దేవ్ (8)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. శివలాల్‌ మేఘ్వాల్‌ కుటుంబం సామూహిక ఆత్మహత్య వెనుకగల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. శివలాల్‌ మేఘ్వాల్‌ కుటుంబ సభ్యుల మృతదేహాలను వారి బంధువుల సమక్షంలో వాటర్‌ ట్యాంక్ నుండి వెలికితీశారు.

శివలాల్‌ మేఘ్వాల్‌కు అతని సోదరుడు ఫోన్  చేసినప్పుడు ఎటువంటి సమాధానం రాకపోవడంతో, అతను పొరుగింటివారిని శివలాల్‌ మేఘ్వాల్‌ ఇంటికి వెళ్లి చూసిరమ్మనడంతో ఈ ఘటన వెలుగు చూసిందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్‌పీ)మనారామ్ గార్గ్ మీడియాకు తెలిపారు. శివలాల్‌ మేఘ్వాల్‌ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌లో తమ నిర్ణయానికి  ముగ్గురు వ్యక్తులు కారకులని, వారిలో  తన సోదరుడు ఒకరని రాసివుంది. కుటుంబ సభ్యుల మధ్య భూ వివాదం సంవత్సరాల తరబడి నడుస్తున్నదని లేఖలో వెల్లడయ్యింది. తమ నలుగురి అంత్యక్రియలు తమ ఇంటి ముందు నిర్వహించాలని ఆ లేఖలో శివలాల్‌ మేఘ్వాల్‌ అభ్యర్థించారు.

మృతురాలు కవిత మామ తెలిపిన వివరాల ప్రకారం, శివలాల్‌ మేఘ్వాల్‌.. కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద మంజూరు చేసిన నిధులను ఉపయోగించి ఇల్లు  కట్టుకోవాలనుకున్నాడు. అయితే అందుకు అతని తల్లి, సోదరుని నుంచి వ్యతిరేకత ఎదురయ్యింది. ఈ నేపధ్యంలోనే శివలాల్‌ మేఘ్వాల్‌ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నదని కవిత మామ ఆరోపించారు. ఘటన జరిగిన రోజున ఇతర కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేదని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Mali: ‘అల్ ఖైదా’ మరో ఘాతుకం.. ముగ్గురు భారతీయుల అపహరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement