
సాక్షి,చిత్తూరు: తిరుపతిలో నాలుగు మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. తిరుపతిలోని పాకాల మండలం పాకాలవారిపల్లిలోని నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఓ జంటతోపాటు ఇద్దరు పిల్లల మృతదేహాలను అటవీప్రాంతంలో పశువుల కాపరులు గుర్తించారు. భయాందోళనకు గురైన పశువుల కాపరులు మృతదేహాలపై పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టానికి పంపించారు. బాధితులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మృతిచెంది ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలకు సమీపంలో మద్యం బాటిళ్లు, మాత్రలు,దస్తులు, చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.