సాక్షి, నెల్లూరు జిల్లా: ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. బీచ్‌లో స్నానానికి దిగిన ముగ్గురు మృతి చెందారు. మృతులను నారాయణరెడ్డి పేటకు చెందిన విద్యార్థులు మహ్మద్, ఉమయున్, సమీద్‌గా పోలీసులు గుర్తించారు.
ఆదివారం సెలవు దినం కావడంతో ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్‌లో ఈత కొట్టడానికి ముగ్గురు ఇంటర్ విద్యార్థులు నీళ్లలోకి దిగారు. ప్రమాదవశాత్తూ వారు గల్లంతు కాగా.. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టి వెలికి తీశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


