అందుబాటులో ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్
నెల్లూరు(అర్బన్): నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కంటి రెటీనా వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఓజర్డెక్స్ అనే ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చామని కంటి విభాగాధిపతి డాక్టర్ వసంత తెలిపారు. మంగళవారం ఆస్పత్రిలో పీజీ వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఇంజెక్షన్ ఖరీదు రూ.36 వేలు అన్నారు. ఏబీబీవీఐఈ సంస్థ స్పాన్సర్‌గా రెటీనా కన్సల్టెంట్ డాక్టర్ రాజశేఖర్ ఎలాంటి వారికి, ఏ స్థితిలో ఇవ్వాలో వివరించారు. నారాయణ ఆస్పత్రి కంటి వైద్య విభాగానికి చెందిన పీజీ వైద్య విద్యార్థులు, యువ వైద్యులు ఇంజెక్షన్ గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి సహకారంతో శిక్షణను నిర్వహించారు. డయాబెటిక్ మాక్యులర్ ఎడిమా, కంటి రక్తనాళాల అడ్డంకి, యువైటీస్ వంటి వ్యాధుల్లో వినియోగించే ఇంజెక్షన్లపై అవగాహన కల్పించారు. కంటి సమస్యలున్న పేదలు వినియోగించుకోవాలని అధికారులు కోరారు.


