రైలు కిందపడి వృద్ధుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి వృద్ధుడి ఆత్మహత్య

Apr 3 2026 7:44 AM | Updated on Apr 3 2026 7:44 AM

నెల్లూరులో ఘటన

నెల్లూరు(క్రైమ్‌): ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ గుర్తుతెలియని ఓ వృద్ధుడు లక్నో ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున నెల్లూరు రంగనాయకులపేట రైల్వేగేటు సమీపంలో కావలి వైపు వెళ్లే పట్టాలపై చోటుచేసుకుంది. మృతుడు సుమారు 5.3 అడుగుల ఎత్తు ఉన్నాడు. 60 నుంచి 65 సంవత్సరాల్లోపు వయస్సు ఉంటుంది. కాషాయం రంగు ఫుల్‌హ్యాండ్స్‌ చొక్కా, బంగారు అంచుగల కాషాయం రంగు పంచె ధరించి ఉన్నాడు. ఘటనా స్థలాన్ని నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్‌.హరిచందన పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నెల్లూరు రైల్వే పోలీసులకు తెలియజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement