లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకూ పోరాటం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): లేబర్ కోడ్స్‌ను రద్దు చేసే వరకూ పోరాటం చేస్తామని వివిధ సంఘాల నేతలు తెలిపారు. ట్రేడ్ యూనియన్లు, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు మంగళవారం నెల్లూరులోని టౌన్‌హాల్లో సదస్సు నిర్వహించాయి. దీనికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అజయ్‌కుమార్, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జయకుమార్‌రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కొండలరావు, ఏఐఎఫ్‌టీయూ (న్యూ) రాష్ట్ర అధ్యక్షుడు జాస్తి కిశోర్‌బాబు, ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు మోహన్ మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగుల హక్కులను హరించేలా కార్మిక చట్టాలను రద్దు చేసిందన్నారు. కొత్త లేబర్‌కోడ్స్ అమలైతే కార్మికవర్గం కనీస వేతనం కోల్పోతుందని, ఉద్యోగభద్రత ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 12వ తేదీన జరిగే సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర బడ్జెట్ కార్మికులు, సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా ఉందన్నారు. కార్పొరేట్లకు ఆదాయాన్ని సమకూర్చే బడ్జెట్ అని ఆరోపించారు. సదస్సులో నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, బసవరాజు, టీవీవీ ప్రసాద్, గోగుల శ్రీనివాసులు, జలీల్‌ఖాన్, శంకర్ కిశోర్, యానాదయ్య, రాంబాబు, వినోదిని తదితరులు పాల్గొన్నారు.


