కేన్సర్.. డేంజర్ బెల్స్
● వేగంగా పెరుగుతున్న కేసుల సంఖ్య
● జిల్లాలో ఇప్పటికే సుమారు
35 వేలమంది రోగులు
● అవగాహన, స్క్రీనింగ్ పరీక్షలతో చెక్
● నేడు ప్రపంచ కేన్సర్ నివారణ
దినోత్సవం
మేజర్, మైనర్
సంవత్సరం ఆపరేషన్లు కీమో తీసుకుంది
2021 933 7,106
2022 1,055 9,497
2023 1,029 10,739 2024 1,135 8,871
2025 1,077 9,200
● గతేడాదిలో సుమారు 9,757
కొత్త కేసులకు రేడియోథెరపీ ఇచ్చారు.
నెల్లూరు(అర్బన్): పాతికేళ్ల క్రితం సమాజంలో ఎక్కడో ఒకటి, అరా కేన్సర్ కేసులు కనిపించేవి. జీవనశైలిలో మార్పులు, కాలుష్యం, కల్తీ ఆహారం, ప్లాస్టిక్ వినియోగంతో ఇప్పుడు చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లాలో 35 వేల మంది వరకు బాధితులున్నట్టు వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ఇంటి పెద్దకు జబ్బు వస్తే కుటుంబ సభ్యులంతా అల్లాడిపోతున్నారు. ఆర్థికంగా మాత్రమే కాకుండా మానసికంగా కుంగిపోతున్నారు. అనేకమంది మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ ఆరోగ్య సంఘాల సహకారంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీని ప్రపంచ కేన్సర్ నివారణ దినోత్సవంగా ప్రకటించింది. జిల్లాలో బుధవారం వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి.
ప్రతి ఏడాది
జిల్లాలో కేన్సర్ రోగులు ప్రతి ఏడాది పెరుగుతున్నారు. నెల్లూరు నగరంలో పూర్తిస్థాయిలో మెడికవర్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్, రెడ్‌క్రాస్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో సేవలందుతున్నాయి. తర్వాత ప్రభుత్వ పెద్దాస్పత్రిలో రేడియేషన్ మినహా మిగతా కీమో, సర్జరీలు లాంటివి చేస్తున్నారు. ఇంకా నారాయణ, అపోలో ఆస్పత్రుల్లో కీమో సేవలందిస్తున్నారు. మెడికవర్‌లో గత రెండేళ్లుగా రెడ్‌క్రాస్ ఆస్పత్రి స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోజూ ఓపీ 10 నుంచి 15 వరకు ఉంది. నెలకు సరాసరి 20 నుంచి 22 మందికి ఆంకాలజీ, మరికొన్ని సర్జరీలు జరుగుతున్నాయి. ఇక చైన్నె, హైదరాబాద్, తిరుపతి నగరాలకు వెళ్లి చికిత్స పొందేవారు కూడా నాలుగు వేల మంది వరకు ఉన్నట్టు అంచనా.
తొలిదశలో గుర్తిస్తేనే..
చాలామందికి కేన్సర్ ఉన్నట్టు తెలియదు. మూడో, నాలుగో స్టేజీల్లో బయటపడుతుంది. చివరి దశలో గుర్తిస్తే ప్రాణాంతకం. అందువల్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలి. 35 సంవత్సరాల వయసు దాటిన వారు సంవత్సరానికి ఒక దఫా ముందస్తు స్క్రీనింగ్ చేయించుకోవాలి. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సులభతరంగా చికిత్స అందించవచ్చు. అలాగే 9 నుంచి 14 ఏళ్ల వయసున్న బాలికలకు కొన్ని రకాల కేన్సర్‌లు సోకకుండా వాక్సిన్ వేయిచాలి. 40 ఏళ్లు దాటిన సీ్త్రలు మోమోగ్రఫీ, పాప్‌స్మియర్ లాంటి పరీక్షలు చేయించుకోవాలి.
రెడ్‌క్రాస్ కేన్సర్ ఆస్పత్రిలో పరిశీలిస్తే..


