Two Man Killed In Road Accident At Hyderabad - Sakshi
Sakshi News home page

Hyderabad: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం..

Dec 6 2021 10:25 AM | Updated on Dec 7 2021 4:54 PM

Two Killed In Road Accident In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెంబర్‌-2లో ఆదివారం అర్ధరాత్రి కారు బీభత్సాన్ని సృష్టించింది. కారు అతివేగంతో రోడ్డును దాటుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మృతులు త్రిభువన్‌(23), ఉపేందర్‌(25)లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరు రెయిన్‌బో ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు తెలిపారు.  కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.

నిందితులు రోహిత్‌గౌడ్, సాయిసోమన్‌

వాహన ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు గుర్తించారు. కారు ప్రమాదం తర్వాత నిందితుడు.. జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి వెళ్లి కారును పార్క్‌ చేశాడు. ఈ నేపథ్యంలో.. అక్కడ డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్‌ అనుమానించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా, మృత దేహలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మృతులు దేవేంద్రకుమార్‌ ,అయోధ్య రాయ్ 

Advertisement
 
Advertisement
Advertisement