‘మా పాప చనిపోయేంత వరకూ పోలీసులు పట్టించుకోలేదు’ | Anantapur Student Tragedy Protest At SP Office | Sakshi
Sakshi News home page

‘మా పాప చనిపోయేంత వరకూ పోలీసులు పట్టించుకోలేదు’

Jun 9 2025 6:22 PM | Updated on Jun 9 2025 6:33 PM

Anantapur Student Tragedy Protest At SP Office

అనంతపురం:  ఇంటర్‌ విద్యార్థిని తన్మయి దారుణ హత్యకు గురికావడంపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు(సోమవారం, జూన్‌9) తన్మయి తల్లి దండ్రులతో కలిసి గిరిజన సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. పోలీసులు సరిగా పని చేయకపోవడం లేదంటూ నినాదాలు చేస్తూ అనంతపురం ఎస్పీ కార్యాలయాన్ని మట్టడించే యత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితుల చోటు చేసుకున్నాయి. దాంతో ఎస్సీ కార్యాలయం ముందే బైఠాయించి నిరసన తెలిపారు. దీనికి వైఎస్సార్‌సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. 

దీనిలో భాగంగా ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. .. తమ పాప మిస్‌ అయ్యిందని కేసు పెట్టడానికి వెళ్లినా పోలీసులు అస్సలు పట్టించుకోలేదన్నారు. కనీసం ఏ రకంగాను పోలీసులు దర్యాప్తు చేయలేదన్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌ కూడా పరిశీలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామని ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసల నిర్లక్ష్యం కనిపించిందని, ఇప్పుడు డెడ్‌బాడీ కనిపించిన తర్వాత చేసేదేంటని కన్నీటి పర్యంతమయ్యారు. తాము అనుమానితుల గురించి చెప్పినా పట్టించకోకపోవడం వల్లే ఇంతవరకూ వచ్చిందన్నారు.

గిరిజన విద్యార్థిని దారుణహత్య

Anantapur: ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య పై గిరిజన సంఘాల ఆగ్రహం

Advertisement
 
Advertisement
Advertisement