
సాక్షి,హైదరాబాద్: పాతబస్తీలో గుల్జార్ హౌస్ ఘోర అగ్ని ప్రమాదంపై హెచ్‌ఆర్‌సీ సీరియస్ అయ్యింది. ఈ ప్రమాద ఘటనపై సుమోటోగా కేసు విచారణకు కమీషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశించారు.
భవన భద్రత , విద్యుత్ నిర్వహణ, అగ్నిప్రమాద నివారణ పరమైన నిబంధనలు పాటించలేదంటూ మీడియాలో వస్తున్న పలు కథనాలపై హెచ్‌ఆర్‌సీ స్పందించింది. ఘటనలో 17 మంది దుర్మరణం కారణాలపై జూన్ 30లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ , అగ్నిమాపక శాఖ డీజీ , టీఎస్ఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్లకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.